Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదు.. మోడీ ఫలితాలు : రాహుల్ గాంధీ

rahul gandhi

ఠాగూర్

, ఆదివారం, 2 జూన్ 2024 (18:07 IST)
దేశంలో ఏడు దశల్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై అనేక సర్వే సంస్థలు శనివారం సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాదని, మోడీ ఫలితాలంటూ కామెంట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు శనివారం సమావేశమయ్యారు. 
 
ఈ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా శనివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి.
 
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... కార్పొరేట్ ఆట : సంజయ్ రౌత్ 
 
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రికల ఎన్నికలో పోలింగ్ జూన్ ఒకటో తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఈ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను వెల్లడించిన సర్వేలన్నీ బీజేపీ కూటమికి అనుకూలంగా మెజార్టీ కట్టబెట్టాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై శివసేన సీనియర్ నేత, మాజీ మంత్రి సంజయ్ రౌత్ మరో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓ కార్పొరేట్ ఆటగా అభివర్ణించారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉండటంతోనే ఫలితాలన్న ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ ఫలితాలను కార్పొరేట్ల ఆటగా అభివర్ణిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కూటమికి 295 నుంచి 310 స్థానాల వరకు వస్తాయని జోస్యం చెప్పారు. 
 
బారామతిలో ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆయన చెప్పారు. గతంలో సాధించిన 18 సీట్లను తమ పార్టీ శివసేన నిలబెట్టుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఈసారి అద్భుత ప్రదర్శన కనపరుస్తుందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి ఏకంగా 35, బీహార్‌లో ఆర్జేడీ 16 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే అత్యంత సీనియర్ ముఖ్యమంత్రికి అనూహ్య ఓటమి!