Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నమ్మ దర్శనం కావాలా: మాజీ మంత్రులనే తరిమికొట్టిన పోలీసులు

బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దర్శించుకోవాలని చెన్నై నుంచి బయలు దేరిన అన్నీడీఎంకే మాజీ మహిళా మంత్రుల్ని కర్నాటక జైలు పోలీసులు తరిమికొట్టారు.

చిన్నమ్మ దర్శనం కావాలా: మాజీ మంత్రులనే తరిమికొట్టిన పోలీసులు
హైదరాాబాద్ , శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (02:24 IST)
బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను దర్శించుకోవాలని చెన్నై నుంచి బయలు దేరిన అన్నీడీఎంకే మాజీ మహిళా మంత్రుల్ని కర్నాటక జైలు పోలీసులు తరిమికొట్టారు. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గిన అనంతరం శశికళను కలిసి పార్టీ వ్యవహారాలను వివరించాలని ఆశతో వెళ్లిన ఈ మంత్రులకు పరప్పన జైలు వద్ద భంగపాటు కలిగింది. ఈ నేపథ్యంలోనే కావచ్చు.. శశికళ నియమించిన ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బెంగళూరు జైలుకెళ్లి కలిసిరావాలనే ప్రయత్నించినా ఎందుకో విరమించారు. సశికళ బంధువు టీటీవీ దినకరన్‌ మాత్రమే ఇంతవరకుచిన్నమ్మను కలిసివచ్చారు. 
 
రాష్ట్ర మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా మంగళవారం బెంగళూరుకు వెళ్లి జైలు అధికారులను లిఖితపూర్వకంగా కోరినా అనుమతి లభించలేదు. కర్ణాటక డీజీపీ నుంచి ఉత్తర్వులు పొందాలని జైలు అధికారులు వారిని నిరాకరించారు.  శశికళ చూసేందుకు అంటూ గుంపులు గుంపులుగా జైలు ముందు చేరితే సహించేది లేదని జైలు అధికారులు హెచ్చరించారు. 
 
ఇదిలా ఉండగా, శశికళను కలుసుకునేందుకు అగ్రహార జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు పి. వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతిలకు ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం రాత్రి జైలు వద్దకు వెళ్లిన ఈ ముగ్గురిని లోనికి అనుమతించలేదు. దీంతో జైలు పరిసరాల్లో నిల్చుని ఉండగా జైలు సిబ్బంది లాఠీలతో వచ్చి తరిమివేయడంతో పరుగులాంటి నడకతో వారు బతుకు జీవుడా అని అక్కడి నుంచి  బైటపడ్డారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్నెల్ల తర్వాతే చిన్నమ్మకు బెయిల్: చెన్నయ్ జైలుకు తరలింపు ఇక మర్చిపోవలిసిందే!