Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతీ భారతీయుడు ఓ వీఐపీనే.. అన్న మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీ

ఆంబులెన్స్‌కు దారి ఇవ్వడంకోసం తన కాన్వాయ్‌నే పక్కన ఆపేసి ఆంబులెన్స్‌ని పోనివ్వమంటూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన ఘటన మోదీని దేశ ప్రజల ప్రియమైన ప్రధానమంత్రిగా మరోసారి ఆకాశమంత ఎత్తున నిలిపింది.

Advertiesment
Every
హైదరాబాద్ , గురువారం, 25 మే 2017 (03:13 IST)
దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరిలోనూ తానొక విలక్షణ ప్రధాని అనే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పదే పదే నిరూపించుకుంటూనే ఉన్నారు. ప్రధాని కాన్వాయ్‌కి పొరపాటున అడ్డమొచ్చినందుకు కాళ్ళకు బుల్లెట్ల వర్షం కురిపించిన మహా దర్పం రాజ్యమేలిన పాడుకాలంతో పోలిస్తే మోదీ తాను ప్రజలనాయకుడినే అని అవకాశమొచ్చిన ప్రతిసారీ రుజువు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆంబులెన్స్‌కు దారి ఇవ్వడంకోసం తన కాన్వాయ్‌నే పక్కన ఆపేసి ఆంబులెన్స్‌ని పోనివ్వమంటూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన ఘటన మోదీని దేశ ప్రజల ప్రియమైన ప్రధానమంత్రిగా మరోసారి ఆకాశమంత ఎత్తున నిలిపింది.
 
విషయానికి వస్తే ఈ మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 52వ ఆఫ్రికన్‌ అభివృద్ధి బ్యాంక్‌ వార్షిక సమావేశ ప్రారంభోత్సవానికి హాజరై ప్రధాని నరేంద్రమోదీ తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో గాంధీనగర్‌-అహ్మదాబాద్‌ రోడ్డుపై వెళ్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం ప్రధాని మోదీ తన కాన్వాయ్‌ను ఆపేశారు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను రహదారి పక్కగా ఆపేసి అంబులెన్స్‌ వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా సిబ్బందికి ప్రధాని ఆదేశాలు ఇచ్చారు. ఆయన చేసిన పనితో మోదీ ప్రజల నాయకుడని మరోసారి నిరూపితమైంది.
 
గతంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌ పర్యటన సమయంలోను ప్రధాని నరేంద్రమోదీ ప్రొటోకాల్‌ను పక్కన బెట్టి సాధారణమైన ట్రాఫిక్‌లో విమానాశ్రయానికి చేరుకున్నారు. వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు తమ వాహనాలపై ఉన్న ఎర్రబుగ్గలను తొలగించాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతీ భారతీయుడు ఓ వీఐపీనే అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.
 
సాధారణంగా ప్రధానమంత్రి వస్తున్నారంటే ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రజల వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం విశేషం. తాను కాన్వాయ్‌లో వెళుతుండగా ఉన్నట్లుండి రోడ్డుమీదికి వచ్చిన పాపాయిని చూసి వెంటనే తన వద్దకు పిలిపించుకుని పరామర్శించిన ప్రధాని దేశ ప్రజలందరి మన్ననలను చూరగొనడం తెలిసిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిభావంతుల చదువు బాధ్యత ప్రభుత్వానిదే... వాళ్లే ఆస్తి... సీఎం చంద్రబాబు నాయుడు