Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారంలో 4 రోజులు పనిదినాలు... మూడు రోజులు సెలవులు.. ఎక్కడ?

వారంలో 4 రోజులు పనిదినాలు... మూడు రోజులు సెలవులు.. ఎక్కడ?
, శనివారం, 19 జూన్ 2021 (14:08 IST)
దేశంలో కొత్త కార్మిక చట్టం (లేబర్ యాక్ట్) అమల్లోకిరానుందా? ఈ చట్టం అమల్లోకి వస్తే వారంలో నాలుగు రోజుల పాటు పని, మూడు రోజుల పాటు సెలవులు లభిస్తాయా? దీనికి చాలా మంది అవుననే అంటున్నారు. 
 
ప్రభుత్వం కొత్త లేబర్ యాక్ట్ కోసం కసరత్తు చేస్తోంది. ఇందులో పెను మార్పులు రావొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సెలవుల నిబంధనలలో మార్పు రావచ్చని అంటున్నారు. ఈ కొత్త కార్మిక చట్టాల ప్రకారం రాబోయే రోజుల్లో వారంలో మూడు రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. 
 
అదే జరిగితే పని గంటల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం రోజుకు 8 గంటలు చేయాల్సివుంటుంది. కానీ, కొత్త కార్మిక చట్టం మేరకు రోజుకు 12 గంటల పాటు పని చేయాల్సివుంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఈ ఒప్పందం చేసుకోవచ్చు.
 
ఏదేమైనా 4 రోజులు పనిచేసిన తర్వాత మీ రోజువారీ షిఫ్ట్ సమయాలలో మార్పు ఉండవచ్చు. దీని కారణంగా పని గంటలను 12కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎంపికను కొత్త లేబర్ కోడ్‌లోని నిబంధనలలో కూడా ఉంచనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 
 
దీనిపై కంపెనీ ఉద్యోగులు పరస్పరం అంగీకరించిన నిర్ణయం తీసుకోవచ్చు. దీనితో పాటు వారంలో 48 గంటల పని గరిష్ట పరిమితిని ఉంచినట్లు కూడా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో పని దినాలను తగ్గించవచ్చు.
 
ప్రస్తుతం వారానికి 5 రోజులు 9 గంటలు పని చేస్తే ప్రతి వారం 45 గంటలు పని చేస్తారు. 12 గంటల షిఫ్ట్ ప్రకారం 4 రోజులు పని చేస్తే 48 రోజులు పని చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు అదనపు పనిని 30 నిముషాలు లెక్కించడం ద్వారా 15 నుంచి 30 నిమిషాల మధ్య ఓవర్ టైమ్‌లో లెక్కించే నిబంధన ఉంది. 
 
తద్వారా కంపెనీ మీకు ఎక్కువ పని చేస్తే మీకు అదనపు డబ్బు కూడా లభిస్తుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా 5 గంటలకు పైగా నిరంతరం పనిచేయడం నిషేధించబడింది. ఎవరైనా 5 గంటలు నిరంతరం పనిచేస్తే ఆ ఉద్యోగికి అరగంట విశ్రాంతి లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త లేబర్ చట్టం ఏం చెబుతుంది? ఎన్ని గంటలు పని చేయాలంటే..?