Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ప్రేమికుల రోజు''కు లోన్ కావాలంట.. ఇదేదో కొత్తగా ఉందే.. బ్యాంక్ ఇచ్చిందా?

Advertiesment
Employee
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (19:12 IST)
పాశ్చాత్య సంస్కృతి కారణంగా తెరపైకి వచ్చిన ప్రేమికుల రోజు.. భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రేమికుల రోజున తమ లవర్‌కు కానుకలివ్వడం పరిపాటి. అయితే ప్రేమికుల రోజున తన ప్రేయసికి విలువైన కానుక ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ.. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు తాను పనిచేసే బ్యాంకులో అడ్వాన్స్ కావాలని అడిగాడు. 
 
సాధారణంగా వ్యాపారం, ఇల్లు కొనడం, వాహనాలు కొనుక్కోవడం కోసం రుణాలు తీసుకోవడం చేస్తుంటాం. అయితే ఇందుకు భిన్నంగా గుజరాత్‌కు ఓ బ్యాంకు ఉద్యోగి ప్రేమికుల రోజుకు రుణం కావాలని అడిగి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా దరఖాస్తు కూడా చేసేసుకున్నాడు. అతని పేరు దిగ్విజయ్ సింగ్ (25). ప్రొబేషనరీ అధికారిగా పనిచేసే ఇతడు రూ. 42,970 అడ్వాన్స్‌గా ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకోగా పరిశీలించిన బ్యాంకు మేనేజర్ దానిని తిరస్కరించారు. 
 
ప్రేమికుల రోజును పండుగగా గుర్తించి లోన్ ఇవ్వడం సాధ్యం కాదని మేనేజర్ తేల్చిచెప్పారు. గతంలో వసంతోత్సవం పండుగకు కూడా లోన్ పెట్టుకుంటే బ్యాంకు మంజూరు చేసిందని డిగ్గీ గుర్తు చేశాడు. తాను పబ్లిసిటీ కోసం ఈ దరఖాస్తు చేసుకోలేదని దిగ్విజయ్ అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu