మా సిరా చుక్కను మీరెలా వాడుతారు : ఆర్థిక శాఖకు ఈసీ ఝులక్
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) గట్టిషాక్ ఇచ్చింది. ఓటింగ్ సమంయలో ఉపయోగించే సిరా చుక్కను మీరెలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లను మార్పిడ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) గట్టిషాక్ ఇచ్చింది. ఓటింగ్ సమంయలో ఉపయోగించే సిరా చుక్కను మీరెలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లే వారికి ఇంకు గుర్తు వాడుతున్నారు. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉందని అందువల్ల సిరా చుక్కను వాడొద్దని పేర్కొంది. నగదు మార్పిడి చేసుకుని సిరా చుక్క పెట్టించుకున్న వారు ఓటు వేయడానికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఇంకు గుర్తు వేయించుకుని పోలింగ్ బూత్‌కు వస్తే అప్పటికే ఓటు వేశారన్న అనుమానం కలిగే అవకాశముందని అందులో పేర్కొంది. బ్యాంకుల్లో ఇంకు గుర్తు వేయరాదని సూచన చేసింది.