Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్పిత ఇంట్లో మరోమారు ఈడీ సోదాలు - రూ.29 కోట్ల నగదు స్వాధీనం

arpita mukherjee
, గురువారం, 28 జులై 2022 (10:56 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఉద్యోగ నియామక కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో దాదాపుగా రూ.29 కోట్ల నగదుతో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నిర్వహించిన సోదాల్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు, బంగారం బయటపడటం రాష్ట్రంలో కలకలం రేపింది. 
 
ఈ సోదాలు బుధవారం మధ్యాహ్నం నుంచి ఈడీ అధికారులు చేపట్టారు. అర్పితా ముఖర్జీకి చెందిన మరో అపార్ట్‌మెంటులో సాగాయి. ఇక్కడ భారీగా రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని బ్యాంకు నుంచి యంత్రాలు తెప్పించి బుధవారం రాత్రి వరకు లెక్కించారు. ఈ కరెన్సీ నోట్లు మొత్తం రూ.29 కోట్లుగా ఉన్నట్టు తేల్చారు. 
 
కాగా, ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేశారు. వీరిద్దరికి కోర్టు వచ్చేనెల 3 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో అర్పిత ఇంట్లో అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. 
 
కాగా, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తున్నది. తన ఇంటిని ఓ బ్యాంకుగా మార్చుకున్నట్లు చెప్పిందని విస్వనీయ వర్గాలు వెల్లడించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్