Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండాకుల కోసం ఓపీఎస్ Vs శశికళ.. సంతకాల సేకరణలో బిజీ బిజీ.. డెడ్‌లైన్ ఏప్రిల్ 17

అన్నాడీఎంకేకు చెందిన గుర్తు రెండాకుల కోసం మాజీ సీఎం ఓపీఎస్, శశికళ వర్గం పోటీపడుతోంది. ఇప్పటికే ఆర్కేనగర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి

Advertiesment
రెండాకుల కోసం ఓపీఎస్ Vs శశికళ.. సంతకాల సేకరణలో బిజీ బిజీ.. డెడ్‌లైన్ ఏప్రిల్ 17
, శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:01 IST)
అన్నాడీఎంకేకు చెందిన గుర్తు రెండాకుల కోసం మాజీ సీఎం ఓపీఎస్, శశికళ వర్గం పోటీపడుతోంది. ఇప్పటికే ఆర్కేనగర్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం తమకే ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ముందు వాదించేందుకు శశివర్గం రెడీ అవుతోంది. పార్టీ కార్యకర్తలు మా వైపే ఉన్నారని నిరూపించుకోవడానికి సంతకాల సేకరణ చెయ్యాలని నిర్ణయించారు. 
 
ఈ క్రమంలో పది లక్షల మంది కార్యకర్తల నుంచి సంతకాల సేకరణ చేయాలని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం ఆ పార్టీ నాయకులకు సూచించారు. ఇదేవిధంగా ఓపీఎస్ కూడా సంతకాల సేకరణ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం కోటి సంతకాల సేకరణ కోసం ఓపీఎస్ కార్యాచరణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండాకుల ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇక ఈ గుర్తును ఎవరికి ఇవ్వాలనే దానిపై ఈ నెల 17వ తేదీ ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకోనుంది. కానీ ఏప్రిల్ 17వ తేదీ ఎన్నికల కమిషన్ డెడ్ లైన్ పెట్టడంతో శశివర్గం 10లక్షల మంది కార్యకర్తల వద్ద సంతకాల సేకరణ జరుపుతున్నారు. ఆ సంతకాల సేకరణ పత్రాలు తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ ముందు బలనిరూపణకు దిగాలని దినకరన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓపీఎస్ వర్గం మాత్రం సైలెంట్‌గా ఉంది. 
 
రెండాకులను సొంతం చేసుకోవడం కోసం ఓపీఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నారనేది సస్పెన్స్‌గా ఉంది. మరి ఓపీఎస్ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోలేకపోయినా.. రెండాకులను సొంతం చేసుకునే విషయంలోనైనా బల నిరూపణ చేసుకుని.. చిహ్నాన్ని కైవసం చేసుకోవాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 ఎన్నికలు.. ఏపీలో మూడు ముక్కలాట.. తెలంగాణలో కేసీఆరే టార్గెట్.. జనసేన, బీజేపీ పక్కా ప్లాన్?