Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదు

కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదు
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (12:13 IST)
భారత దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు కలకలం రేపాయి. కాశ్మీర్​, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్​ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది.
 
ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది. భారత దేశంతో పాటు వివిధ దేశాలలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 
 
ఆప్ఘానిస్థాన్​- తజికిస్థాన్​ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం భారత్​లోని కశ్మీర్​, నోయిడా సహా ఇతర ప్రాంతాలపై పడింది. అటు పాక్​లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించింది. 
 
పాకిస్థాన్​ ఇస్లామాబాద్​లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగ సంఘాలతో చర్చలు : మంత్రి నాని ఆశాభావం