Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుదుక్కోట్టైలో జల్లికట్టు.. ఇద్దరు మృతి.. ఇప్పుడేమంటారు.. వర్మ ప్రశ్న.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు..

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. చాలామంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. జల్లికట్టు సంప్రదాయం అనాగరికమని, వినోదం కోసం మూగజీవులను హింసించడ

పుదుక్కోట్టైలో జల్లికట్టు.. ఇద్దరు మృతి.. ఇప్పుడేమంటారు.. వర్మ ప్రశ్న.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు..
, సోమవారం, 23 జనవరి 2017 (12:50 IST)
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. చాలామంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. జల్లికట్టు సంప్రదాయం అనాగరికమని, వినోదం కోసం మూగజీవులను హింసించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనను ఉద్దేశించి ట్వీట్ చేశారు.  
 
పుదుక్కోట్టై జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు, 129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతు దారులు ఏమంటారు? చెప్పండి.. మేమంతా వినాలి. ఈ ఘటన చూస్తే దేవుడు కూడా జల్లికట్టు మద్దతుదారులపై కోపం చూపుతూ.. ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ అనాగరిక క్రీడను ఇకనైనా ఆపుతారని ఆశిస్తున్నానని వర్మ ట్వీట్‌ చేశారు.
 
ఇదిలా ఉంటే.. జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలోని మెరీనా బీచ్‌ తీరంలో చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జల్లికట్టుకు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినందున ఆందోళన విరమించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకలు మెరీనా బీచ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. 
 
అయితే పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించిన నిరసనకారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మెరీనా బీచ్‌ సమీపంలోని ఐస్‌ హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోకి చొరబడి భవనానికి నిప్పంటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టుతప్పిన జల్లికట్టు... పోలీసు స్టేషన్‌కు నిప్పు.. రణరంగంగా చెన్నై నగరం