Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్-హిల్లరీ వద్దే వద్దు.. ఒబామానే ముద్దు.. అభిప్రాయ సేకరణలో అమెరికా యువత

అమెరికా అధ్యక్షుని హోదా ఆ ఇద్దరికీ దక్కకూడదు అనుకుంటున్నారు.. ఆ దేశపు యువత. దాదాపు నాలుగో వంతు ఉల్కాపాతం జరిగి భూగోళం నాశనమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టక

ట్రంప్-హిల్లరీ వద్దే వద్దు.. ఒబామానే ముద్దు.. అభిప్రాయ సేకరణలో అమెరికా యువత
, బుధవారం, 19 అక్టోబరు 2016 (17:02 IST)
అమెరికా అధ్యక్షుని హోదా ఆ ఇద్దరికీ దక్కకూడదు అనుకుంటున్నారు.. ఆ దేశపు యువత. దాదాపు నాలుగో వంతు ఉల్కాపాతం జరిగి భూగోళం నాశనమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకూడదని అమెరికా యువత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇందుకు అధ్యక్షుడి ఎంపిక విషయంలో అవకాశాలు పరిమితంగా ఉండటమే ప్రధాన కారణం. 
 
ఉల్కాపాతం జరిగి భూగోళం బద్దలవ్వటాన్ని అయినా ఇష్టపడతాం కానీ ట్రంప్‌, హిల్లరీలను శ్వేతసౌధానికి వెళ్లనివ్వమని అమెరికా యువతలో ప్రతి నలుగురిలో ఒకరు చెప్తున్నారు. ఈ విషయంలో యుమాస్ లోవెల్స్  సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ కో డైరెక్టర్‌ జోషు డైక్‌ తెలిపారు. దీనికోసం ట్విట్టర్‌లో జెయింట్‌మెటియోర్‌2016 హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్‌ చేశారు. దీనిలో వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
18 నుంచి 35ఏళ్ల మధ్యలోని 1247 మంది యువతను ప్రశ్నించగా వారిలో 53 శాతం ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్‌ను గెలవనివ్వబోమంటే 34శాతం హిల్లరీని వైట్‌హౌస్‌కు వెళ్లనివ్వమని చెప్తున్నారు. హిల్లరీ క్లింటన్‌కు అధికారం అప్పజెప్పే కంటే బరాక్‌ ఒబామా మరోసారి కొనసాగటమే ఉత్తమమని పేర్కొన్నారు.

26శాతం లాటరీ ద్వారా ఎంపిక చేసుకోవడం ఉత్తమమని ఎద్దేవా చేశారు. 23 శాతం మాత్రం భూగోళం బద్దలైనా వీరిద్దరినీ అసలు గెలవనివ్వకూడదన్నారు. దీనిపై డైక్‌ మాట్లాడుతూ వీరంతా ఏదో సరదాకి చెప్పారని అనుకోవడానికి వీల్లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ ఫోటోతో పన్నీర్ సెల్వం కేబినెట్ భేటీ.. కావేరి సమస్యపై చర్చ 32 మంది మంత్రులు హాజరు..