Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు .. అందుకే డోలో-650 మాత్రలు..

Dolo 650
, గురువారం, 18 ఆగస్టు 2022 (22:17 IST)
ఒక ఫార్మా కంపెనీ తయారు చేసే 650 మాత్రలను వైద్యులు అత్యధిక మంది రోగులకు సిఫార్సు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఓ పిటిషన్ దాఖలు కాగా, దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
తేలికపాటి జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను వైద్యులు రాస్తున్నారంటే అందుకు కారణం ఆ మాత్రల తయారీదారులు వైద్యులకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లనేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను పది రోజుల్లో తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 
 
"పైగా, ఇదేమీ వీనులవిందైన సంగీతం కాదు. నాకు కరోనా వచ్చినపుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ సంస్థ తరపున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. 
 
డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇలాంటి మందుల అతి వినియోగంతో రోగుల  ఆరోగ్యం డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు ఒకటో తేదీన ఛలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు