Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రిలో వైద్యుడి దిగంబరావతారం... డాక్టర్ వికృత చర్యలతో హడలిపోయిన రోగులు...

Advertiesment
doctor naked walk

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (12:25 IST)
మహారాష్ట్రంలో ఓ వైద్యుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. వంటిపై నూలుపోగు లేకుండా ఆస్పత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టాడు. దీన్ని చూసిన రోగులు హడలిపోయారు. డాక్టర్ వికృత చర్యలన్నీ సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. పైగా, దిగంబరావతారానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై వైద్యాధికారులు స్పందించి, ఆ వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
మహారాష్ట్రంలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సమీపంలోని బిడ్కిన్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 45 యేళ్ల వయస్సున్న వైద్యుడు ఒకరు మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. అయితే, రోగులు, వారి బంధువులు ఆస్పత్రిలో ఉన్న సమయంలో సదరు వైద్యుడు నగ్నంగా ఆస్పత్రి కారిడార్‌లోకి వచ్చాడు. అతన్ని చూసిన రోగులు, వారి బంధులు హడలిపోయారు. డాక్టర్ గారి దిగంబరావతారంతో షాక్‌కు గురయ్యారు. 
 
డాక్టర్ అరాచకత్వం సీసీటీవీలో నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లింది. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ దయానంద్ దీనిపై స్పందిస్తూ, ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, డాక్టర్ నిర్వాకంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఆ వైద్యుడు మద్యం మత్తులో నగ్నంగా తిరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సనంద్ ఫెసిలిటీ నుండి 1 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన టాటా మోటార్స్