Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ ఆరోగ్య దినం ప్రత్యేకత తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినం ప్రత్యేకత తెలుసా?
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:11 IST)
1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ తేదిని ఎంపిక చేసారు. ఎవరో వచ్చి, ఏదో చేయరు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంకల్పించుకోవాల్సింది మనమే.

శ్రద్ధ తీసుకోవాల్సిందీ మనమే. ఆరోగ్య సంరక్షణలో అన్నింటికన్నా ముఖ్యమైంది, కీలకమైంది మన జీవనశైలే. మంచి ఆహారం, బరువు అదుపు, క్రమం తప్పని వ్యాయామం విషయంలో పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. చిన్న చిన్న మార్పులైనా చాలు. నెమ్మదిగా ఆరంభించినా చాలు. 

పెద్ద ప్రయోజనమే కనిపిస్తుంది. క్రమంగా ఒక అలవాటుగా మారి, చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినం పరోక్షంగా ఇదే సూచిస్తోంది. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలని నినదిస్తోంది.

పుట్టిన చోటు, పెరిగిన తీరు, చదివిన చదువు, చేస్తున్న పని, ఆర్థిక స్థితి, జీవన విధానం, వయసు, లింగ బేధం వంటివన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే కావొచ్చు. వైద్య సదుపాయాలు, చికిత్సల విషయంలో ఇవి అసమానతలకూ దారితీస్తుండొచ్చు.

కానీ వ్యక్తిగత శ్రద్ధకు ఇవేవీ ఆంటకాలు కావు. డబ్బున్నా లేకున్నా, ఎవరైనా ఎక్కడైనా మంచి జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జబ్బుల బారినపడకుండా హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు.
 
కోవిడ్19 మళ్లీ విజృంభిస్తోంది.45 ఏళ్లు దాటిన వారు టీకాలు వేసుకుని రక్షణ పొందండి. ప్రతిఒక్కరు కరోనా జాగ్రత్త చర్యలు మరువకండి. ఇది మరింత ముఖ్యమనీ గ్రహించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 2వేలకు చేరువలో కరోనా కేసులు