Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

చేపల పులుసు ఇవ్వను.. : కమల్‌హాసన్

Advertiesment
fish soup
, గురువారం, 25 మార్చి 2021 (09:32 IST)
‘మీ అందరికీ ఉచితంగా చేపల పులుసు వండిపెట్టను. అయితే యేడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇస్తాను. చేపలు పట్టే సామర్థ్యాన్ని అందిస్తాను’ అంటూ మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్న ఆయన ఆ నియోజకవర్గం పరిధిలోని శివానంద కాలనీలో ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. ఉచిత తాయిలాల వల్ల రాష్ట్రంలో పేదరికం పోదని, ఉచితాలు తీసుకోవడమే పనిగాపెట్టుకునే ప్రభుత్వ రుణభారం పెరిగిపోతుందని అన్నారు.

ఈ రుణభారాన్ని నిరోధించడానికి అనువైన పరికరంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ‘మీ అందరికి ఉచితంగా ఒక రోజు చేపలపులుసు అందించి సంతృప్తిపరచాలని భావించడం లేదు. ఏడాది పొడవునా చేపలు పట్టేందుకు వలలు ఇచ్చి మీరు సొంతంగా సంపాదించుకునేలా ఉండాలన్నదే మా పార్టీ ఆశయం’ అన్నారు. 

చేపలు పట్టే టెక్నిక్‌ తెలుసుకుంటే పదిమంది ఉచితంగా చేపల పులుసు ఇచ్చే స్థితికి చేరుకోగలరని కమల్‌ అన్నారు. తనను స్థానికేతరుడని మైలాపూరు అమ్మవారు (వానతి శ్రీనివాసన్‌) చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఈ నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్లాది విష్ణు పదవీ ప్రమాణ స్వీకారం