Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరుణానిధికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో కృత్రిమ శ్వాస... ఆస్పత్రికి నేతల పరుగులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తుల్లో ఇనఫెక్షన్ చేరడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస

Advertiesment
కరుణానిధికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో కృత్రిమ శ్వాస... ఆస్పత్రికి నేతల పరుగులు
, శనివారం, 17 డిశెంబరు 2016 (08:57 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తుల్లో ఇనఫెక్షన్ చేరడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు ‘ట్రక్యోస్టమీ’ (కృత్రిమశ్వాస అందించే పరికరం) అమర్చి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శ్వాసనాళంలో అడ్డంకులు ఎదురవటంతో ఆయన గొంతుకు రంధ్రం వేసి ట్రక్యోస్టమీ పరికరాన్ని అమర్చామని, రోగ నిరోధక మందులతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని కావేరి ఆస్పత్రి ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ అరవిందన్ ప్రకటన విడుదల చేశారు. 
 
93 యేళ్ల కరుణానిధి కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెల్సిందే. నెలక్రితం ఆయన వేసుకునే మందులు వికటించడంతో శరీరమంతా బొబ్బలు వచ్చాయి. అలెర్జీ అధికం కావడంతో వైద్యులు ఇంటివద్దే చికిత్స అందించటంతో కాస్త కోలుకున్నారు. ఆ సమయంలో అపోలో ఆస్పత్రిలో చేర్పించాలని భావించినప్పటికీ.. అపుడు ముఖ్యమంత్రి జయలలిత అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ప్రత్యామ్నాయంగా కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు రోజులపాటు చికిత్స పొందిన కరుణానిధి ఈ నెల 7 సాయంత్రం కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించింది. జలుబు, దగ్గు అధికమై శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కావేరి ఆస్పత్రి నుంచి హుటాహుటిన వైద్యులను పిలిపించారు. కరుణానిధిని పరిశీలించిన వైద్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో గురువారం రాత్రి 11.30 గంటలకు కరుణానిధిని కావేరి ఆస్పత్రికి తరలించారు.
 
వాస్తవానికి కరుణానిధికి ఏమైందన్న చర్చ డీఎంకే శ్రేణుల్లో సాగుతోంది. మందులు వికటించడంతో ఇంటిపట్టునే చికిత్స పొందిన కరుణానిధి గత కొంతకాలంగా ఆహారం తీసుకోలేకపోతున్నారు. 15 రోజులుగా వైద్యులు ‘రెయిల్స్‌ ట్యూబ్‌’ ద్వారా కేవలం ద్రవపదార్థాలను ఆహారంగా అందిస్తున్నారు. ముక్కులో నుంచి ఆహారనాళంలోకి ఏర్పాటు చేసే ఈ రెయిల్స్‌ ట్యూబ్‌ ద్వారా కూడా రెండు రోజులుగా ఆయనకు ద్రవపదార్థాలు ఇవ్వడం కష్టమైపోయినట్లు సమాచారం. తీవ్రమైన జలుబు చేయడంతో ముక్కులో నుంచి అమర్చిన ట్యూబు ద్వారా కూడా ఆహారం అందించలేకపోయారు. 
 
దీనికి తోడు గొంతులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెయిల్స్‌ ట్యూబ్‌ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తేల్చిన వైద్యులు.. గంటగంటకూ నీరసపడుతున్న కరుణను తక్షణం ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులకు సూచించగా, హుటుహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు సీనియర్‌ డాక్టర్‌ కార్తీక్‌రాజా నేతృత్వంలోని వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కరుణానిధికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరోమార్గం లేక ట్రక్యోస్టమీ పరికరాన్ని అమర్చారు. దీని ద్వారా కృత్రిమ శ్వాస అందించడంతో పాటు ద్రవపదార్థాలను కూడా ఉదరంలోకి పంపవచ్చని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం యూట్యూబ్ కొత్త వెర్షన్.. టెస్ట్ రన్ తర్వాత అందుబాటులోకి...