Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుదిరితే అధికారం.. లేదంటే మధ్యంతరమే.. డీఎంకే ఆచితూచి అడుగులు

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని విపక్షమైన డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. అన్నాడీఎంకే కుమ్ములాటలు తమకు కలిసి వస్తే అధికారం చేపట్టాలని లే

కుదిరితే అధికారం.. లేదంటే మధ్యంతరమే.. డీఎంకే ఆచితూచి అడుగులు
, గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:10 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని విపక్షమైన డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. అన్నాడీఎంకే కుమ్ములాటలు తమకు కలిసి వస్తే అధికారం చేపట్టాలని లేనిపక్షంలో మధ్యంతర ఎన్నికల కోసం వెళ్లాలని భావిస్తోంది. ఆ దిశగానే డీఎంకే నేతలు వ్యూహాలు రచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
ఒకవేళ అన్నాడీఎంకేలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ఇవ్వడం కంటే... రిసార్ట్స్‌లో ఉన్న కొందరిని తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్నది ఆ పార్టీ భావన. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా ముందుకు వెళ్లడం మంచిది కాదన్నది పలువురు సీనియర్ నేతల సలహా. 
 
మరోవైపు.. పన్నీర్‌ శిబిరంలో పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక చేసిన పళనిస్వామి శిబిరంలో 124 మంది ఎమ్మెల్యే ఉన్నారు. డీఏంకేకి 89తో పాటు మిత్రపక్షాల నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్‌ ప్రకటించినా... పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదనేది డీఏంకే ముందున్న ప్రధాన లక్ష్యం. దీంతో కువత్తూరు రిసార్ట్స్‌ నుంచి తక్షణం 20 మంది ఎమ్మెల్యేలను తీసుకురాగలిగితే పన్నీర్‌కు మద్దతిచ్చి పళనిని నిరోధించాలని డీఎంకే భావిస్తోంది.
 
కనీసం 10 మందిని తీసుకురాగలిగితే పన్నీర్‌ వద్ద ఉన్న మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 118 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ సీనియర్లకు మంత్రి పదవులు ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డీఎంకే మద్దతుతో పన్నీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్, కేంద్రం సుముఖంగా లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఏంకే పాచికలు ఫలిస్తే సీఎం పీఠం, లేదంటే ఆరు నెలల్లో ఎన్నికలు తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..