Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదు... పన్నీర్ వ్యాఖ్యలపై శశికళ స్పందించాలి: ఎంకే.స్టాలిన్‌

అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదనీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని, ఇందులో తాము వేలు పెట్టబోనని స్పష్టం

Advertiesment
DMK Leader Stalin
, బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (12:03 IST)
అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్త కాదనీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభం అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని, ఇందులో తాము వేలు పెట్టబోనని స్పష్టం చేశారు. 
 
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ప‌లు ఆరోపణల వెనుక త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే ఉందని శశికళ న‌ట‌రాజ‌న్ చేసిన‌ ఆరోపణలపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పందించారు. 
 
బుధవారం మీడియాతో మాట్లాడుతూ ముందు ప‌న్నీర్ సెల్వం చేసిన ఆరోపణలకు శశికళ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదన్నారు. ఆ పార్టీలో జ‌రుగుతున్న‌ అంతర్గత వ్యవహారాల్లో డీఎంకే జోక్యం చేసుకోదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపతో కలిసి పనిచేసేందుకు సై.. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉంది: ఓపీ