Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెంపుడు పావురాల కోసం టర్కీలో హోటల్.. కాస్త ఎక్కువిస్తే.. ఏసీ కూడా అమర్చుతారట

పెంపుడు జంతువుల పట్ల చాలామందికి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. శునకాలు, పిల్లులు, కుందేలుతో పాటు పావురాలను కూడా ఇళ్లల్లో పెంచుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇంటికి దూరంగా గడపాల్సి వచ్చినప్పుడు, పెంపుడు జంతువు

Advertiesment
Diyarbakır becomes home to Turkey's first pigeon hotel
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (15:08 IST)
పెంపుడు జంతువుల పట్ల చాలామందికి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. శునకాలు, పిల్లులు, కుందేలుతో పాటు పావురాలను కూడా ఇళ్లల్లో పెంచుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇంటికి దూరంగా గడపాల్సి వచ్చినప్పుడు, పెంపుడు జంతువులను కమ వెంట తీసుకెళ్ళపోలేని సందర్భాల్లో వాటిని పక్కింట్లో వదిలి వెళ్లడం చేస్తుంటాం. అయితే టర్కీలో పెంపుడు పావురాలకు ఆ సమస్యే లేదు. 
 
ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఇటీవల పెంపుడు శునకాలు, పిల్లుల కోసం ప్రత్యేకమైన హోటల్స్‌ను కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తాజాగా పావురాల కోసం టర్కీలో ఓ హోటల్‌ అందుబాటులోకి వచ్చింది. టర్కీలోని డియార్‌బకీర్‌ ప్రాంతంలో స్థానిక పక్షి ప్రేమికుల సంఘం ఈ పావురాల హోటల్‌ను నిర్మించింది. రెండువేల పావురాలు ఒకేసారి ఉండగలిగేలా 30 గదులను హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. 
 
ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే.. పావురాలను ఈ హోటల్‌లో వదిలిపెట్టి వెళ్ళొచ్చునని.. గదికి మాత్రం అద్దె చెల్లించాల్సి వుంటుందని హోటల్ యాజమాన్యం పేర్కొంది. అయితే ఇళ్లలో ఉండే పక్షులకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి స్వేచ్ఛకు, తోటి పక్షులతో సంబంధాలకు ఆటంకం కలుగుతుందని సంఘం సభ్యులు భావించారు. అదే ఈ హోటల్‌లో అయితే పావురాలకు స్వేచ్ఛ లభించడమే కాదు.. హోటల్‌లో ఉండటానికి వచ్చిన తోటి పక్షులతో కలిసిపోయి హాయిగా ఉంటున్నాయని నిర్వాహకులు అంటున్నారు. 
 
హోటల్‌లోని పక్షులకు ఎలాంటి హాని కలగకుండా.. మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. నెలకు అద్దె సుమారు 3వేల రూపాయల నుంచి 20లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ చెల్లిస్తే పావురం ఉన్న గదికి ఏసీ కూడా అమర్చుతామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దు.. వరుడికి రూ.11కట్నం.. మాలలు మార్చుకుని వధువును ఇంటికి తీసుకెళ్లిపోయాడు..