Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత కిందపడిపోవడం వల్లే అపోలోలో చేరారు.. డిశ్చార్జ్ రిపోర్టులో వెల్లడి..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోయెస్ గార్డెన్‌లోని తన నివాసమైన వేదనిలయం ఇంట్లో కొట్టడం ద్వారా కొనఊపిరితో ఆస్పత్రిలో చేరినట్లు అన్నాడీఎంకేలోని ఓపీఎస్ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను నిజం చ

జయలలిత కిందపడిపోవడం వల్లే అపోలోలో చేరారు.. డిశ్చార్జ్ రిపోర్టులో వెల్లడి..
, గురువారం, 2 మార్చి 2017 (16:07 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోయెస్ గార్డెన్‌లోని తన నివాసమైన వేదనిలయం ఇంట్లో కొట్టడం ద్వారా కొనఊపిరితో ఆస్పత్రిలో చేరినట్లు అన్నాడీఎంకేలోని ఓపీఎస్ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేసేలా అపోల్ డిశ్చార్జ్ రిపోర్ట్ వుంది. జయమ్మను కిందకు తోసేయడం ద్వారానే ఆస్పత్రిలో చేరారని డిశ్చార్జ్ రిపోర్టులో పేర్కొన్నట్లు మాజీ స్పీకర్ పాండ్యన్ మీడియా ప్రతినిధులతో తెలిపారు.  
 
ఓపీఎస్ వర్గానికి చెందిన పీహెచ్ ప్యాండన్, మాజీ మంత్రి పాండ్యరాజన్, మనో పాండియన్ ఉమ్మడిగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జయలలిత మృతి పట్లు పలు అనుమానాలను లేవనెత్తారు. డిశ్చార్జ్ రిపోర్టులో అమ్మ కింద పడిపోవడంతో అపోలో చేరిందని ఉన్న అంశంపై వివరణ కావాలని వారు డిమాండ్ చేశారు. ఆంబులెన్స్‌ కోసం మాట్లాడిన డీఎస్పీ ఎవరు? ఆంబులెన్స్‌కు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? ఆంబులెన్స్ పోయెస్ గార్డెన్‌కు ఎన్ని గంటలకు వచ్చింది.?, జయలలిత అపోలో ఆస్పత్రి చేరిన తర్వాత 27 సీసీటీవీలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పనిని చేయించిందెవరు? ముఖ్యంగా జయమ్మకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భద్రతను ఎందుకు తొలగించారు.? వారిని వెళ్ళిపొమ్మని చెప్పిందెవరు?.. అమ్మ ఇక బతికేది లేదని చికిత్సను ఆపించిందెవరు? కుటుంబ సభ్యులు అమ్మకు చికిత్స అందించడాన్ని ఆపమని చెప్పారంటే.. అందుకు తగిన ఆధారాలెక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
 
సహజ రీతిలో అమ్మ మరణించారని అపోలో నిర్వాహం హైకోర్టులో సమర్పించిన లేఖలో ఏముంది? నవంబర్ 2 నుంచి ఐదో తేదీ వరకు విదేశీ డాక్టర్లు అమ్మకు చికిత్స అందించలేదు ఎందుకని? సింగపూర్ నుంచి ఫిజియోథెరపిస్ట్ వచ్చినందుకు కారణమేమిటి? జయమ్మ చెంపపై 4 హోల్స్ ఎందుకు? అమ్మను అపోలోలో చేర్చిన 75 రోజుల్లో పరామర్శించేందుకు వచ్చినవారెందరు? అమ్మ డిసెంబర్ 4న 4.30 గంటలకే మరణించినట్లు వార్తలొచ్చినా.. డిసెంబర్ 5వ తేదీ వరకు ఆమె మరణంపై ధ్రువీకరించకపోయేందుకు కారణం ఏమిటని ఓపీఎస్ వర్గం ప్రశ్నించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్లు వైద్యులు కాదు.. రాక్షసులు... జలగల్లా పీల్చేస్తున్నారు... కేసీఆర్ ఫైర్, కొరడా...