Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాయ్‌ఫ్రెండ్స్‌తో మజా చేసేందుకు.. అమ్మమ్మ.. తాతయ్య గదికి నిప్పంటించింది..

బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు అమ్మమ్మ, తాతయ్యలు అడ్డుగా ఉన్నారని.. వారిని సజీవదహనం చేసేందుకు రెడీ అయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించింది. వారుండే గదికి తాళం వేసింది. ఆపై

బాయ్‌ఫ్రెండ్స్‌తో మజా చేసేందుకు.. అమ్మమ్మ.. తాతయ్య గదికి నిప్పంటించింది..
, శుక్రవారం, 17 మార్చి 2017 (13:54 IST)
బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు అమ్మమ్మ, తాతయ్యలు అడ్డుగా ఉన్నారని.. వారిని సజీవదహనం చేసేందుకు రెడీ అయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలను సజీవదహనం చేసేందుకు ప్రయత్నించింది. వారుండే గదికి తాళం వేసింది. ఆపై నిప్పంటించి పారిపోయింది. ఈ ఘటన మైసూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైసూరులోని లక్ష్మికాంత నగర్ మొదటి స్టేజ్‌లో సోమసుందర్, లీలావతి అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మనవరాలు ప్రియదర్శిని (22). ప్రియదర్శిని మోడల్‌గా పనిచేస్తోంది. 
 
తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో పాటు తల్లి ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడటంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. అయితే ప్రియదర్శిని బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు అమ్మమ్మ, తాతయ్య ప్రతీసారి అడ్డు చెప్తూ వచ్చారు. దీంతో బాయ్‌ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి వారిని చితకబాదేది. అయినా ఆ వృద్ధ దంపతులు వయసు మీదపడిన కారణంగా ఓర్చుకుని ప్రియదర్శినితోనే ఉంటున్నారు. 
 
అయితే ప్రియదర్శిని అంతటితో ఆగకుండా వారిని సజీవదహనం చేసేందుకు యత్నించింది. గురువారం మధ్యాహ్నం అమ్మమ్మ, తాతయ్యలున్న గదికి తాళం వేసింది. నిప్పంటించి.. బయటివారికి తెలిసేలోపు అక్కడి నుంచి పారిపోయింది. వృద్ద దంపతులు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపోరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఇరుగుపోరుగు వారు వచ్చి మంటలు అదుపు చేశారు. 
 
బాధితులను ఆసుపత్రికి తరలించారు. వృద్ద దంపతులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని మైసూరులోని హెబ్బాళ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రియదర్శిని కోసం గాలిస్తున్నామని వారు తెలిపారు. ప్రియ డ్రగ్స్ కోసం డబ్బివ్వాలని వృద్ధ దంపతులను తరచూ హింసించేదని, వారు ఇవ్వకపోతే చితకబాదేదని స్థానికులు చెప్తున్నారు. డ్రగ్స్, మద్యానికి బానిసైన ప్రియ తరచూ బాయ్ ప్రెండ్స్‌ని ఇంటికి రప్పించుకునేదని స్థానికులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా బ‌తికి ఉంటే ప‌ల్లెకు 50-50 ఛాన్స్ ఉండేద‌య... ఏంటది?