నోట్ల రద్దుతో హైదరాబాదీ బిర్యానీ అమ్మకాలు డౌన్.. దేశం కోసం బిర్యానీ తినడం త్యాగం చేస్తున్నాం..
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో.. నోట్ల రద్దు కారణంగా చిన్న వ్యాపారులు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. పండ్ల, పువ్వులు, కూరగాయలు కొనేవారు లేకపోవడంతో మార్కెట్లు వెల
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో.. నోట్ల రద్దు కారణంగా చిన్న వ్యాపారులు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. పండ్ల, పువ్వులు, కూరగాయలు కొనేవారు లేకపోవడంతో మార్కెట్లు వెలసిపోతున్నాయి. ఇందులో భాగంగా దేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల హైదరాబాద్ నగరంలో బిర్యానీ విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నగరంలోని పాత నోట్లను తీసుకోకపోవడంతో రెస్టారెంట్లకు వచ్చే భోజనప్రియుల సంఖ్య తగ్గింది.
కొత్తగా విడుదలైన రెండువేల రూపాయల నోటు తెచ్చినా వారికి తామెక్కడ నుంచి చిల్లర ఇవ్వాలని రెస్టారెంట్ క్యాషియర్లు చెప్పేయడంతో బిర్యానీ తినడం ఎందుకని భోజనప్రియులు మిన్నకుండిపోతున్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు దేశం కోసం తాము బిర్యానీ తినకుండా త్యాగం చేస్తున్నామని ఓ యువకుడు తెలిపాడు.
మరోవైపు కేంద్రఅధికారుల బృందం హైదరాబాద్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను పరిశీలించనుంది. రైతులు, కార్మికులు, కూలీలు, వ్యాపారులు, పరిశ్రమలు, చిన్నవ్యాపారులు పెద్ద నోట్ల రద్దు వల్ల పడుతున్న కష్టాలను ఈ కమిటీ సభ్యులు పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.