Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ వద్ద రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోండి...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వారివద్ద ఉండే రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలన్న ఆందోళన, భయం వారి

Advertiesment
మీ వద్ద రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోండి...
, బుధవారం, 9 నవంబరు 2016 (08:44 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వారివద్ద ఉండే రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలన్న ఆందోళన, భయం వారిలో కొనసాగుతోంది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. 
 
సామాన్యుల తక్షణ అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 72 గంటలపాటు అంటే... ఈనెల 11వ తేదీ రాత్రి 12 గంటల వరకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. 
 
ఈ 72 గంటలు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లనూ తీసుకుంటారు. 
 
వైద్యుల రాసిన మందుల చీటి చూపించి... మెడికల్‌ షాపుల్లోనూ పాత 500, రూ.1000 నోట్లతో ఔషధాలు కొనుగోలు చేసుకోవచ్చు. రోగులకు చికిత్సలో ఇబ్బంది రాకుండా చూసేందుకు ఈ తరహా వెసులుబాటు కల్పించారు. 
 
అలాగే, 72 గంటలపాటు రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, ప్రభుత్వ బస్‌ టికెట్‌ కౌంటర్లు, విమానాశ్రయాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ టికెట్‌ కౌంటర్లలో 500, 1000 పాత నోట్లు చెల్లుతాయి. ప్రజల ప్రయాణ ఏర్పాట్లకు ఆటంకం కలుగకుండా ఈ వెసులుబాటు. 
 
ప్రభుత్వ రంగ సంస్థలు నడిపే పెట్రోలు బంకులు, గ్యాస్‌ స్టేషన్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల స్టోర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిల్క్‌ బూతల్లోనూ 72 గంటలపాటు చెల్లుబాటు అయ్యేలా వెసులుబాటు కల్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లధనం ఇక చెల్లు... కొత్తగా 'నానో టెక్నాలజీ'తో రెడ్ ఫోర్ట్ రూ.500, మంగళ్ యాన్ రూ.2000 నోట్లు ఇలా...