Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోట్ల రద్దుపై మీ అభిప్రాయం తెలిపేందుకు మొబైల్ యాప్.. ప్రధాని మోడీకి నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివే!

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకోవడమేకాకుండా, ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కడిగి పారేయాలని, ప్రశ్నల వర్షం సంధించాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం.

నోట్ల రద్దుపై మీ అభిప్రాయం తెలిపేందుకు మొబైల్ యాప్.. ప్రధాని మోడీకి నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివే!
, బుధవారం, 23 నవంబరు 2016 (17:02 IST)
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకోవడమేకాకుండా, ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కడిగి పారేయాలని, ప్రశ్నల వర్షం సంధించాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించండి. 
 
ఆగండి.. ఆగండీ.. ఆ ప్రశ్నలు మీ ఇష్టానుసారంగా సంధించేందుకు కుదరదు. ఇందుకోసం మొబైల్ యాప్‌ను ఆయన రిలీజ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రజల నాడిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ యాప్ రిలీజ్ చేయడం జరిగింది. 
 
అయితే, నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం తప్పా, ఒప్పా అని చెప్పేందుకు గానీ, విమర్శించేందుకు గానీ ఆ పది ప్రశ్నల్లో పెద్దగా ఆస్కారం లేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాయితీగా ప్రజల స్పందనను కోరుకుంటే ఆయన అడగాల్సిన 10 ప్రశ్నలు ఇలా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానికి నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివే. 
 
1. మీ ఖాతా నుంచి మీ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకు వద్ద లేదా ఏటీఎం వద్ద ఎంతసేపు నిరీక్షించారు?
2. మీ అవసరాలకు తగ్గ డబ్బును డ్రా చేసుకున్నారా? చేసుకుంటే ఎన్నిసార్లు క్యూలో నిలబడ్డారు? ఒక్కోసారి ఎంత సమయాన్ని వెచ్చించారు?
3. మీరు ఎదుర్కొన్న సమస్య ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? 
ఏ. నల్లడబ్బుపై ప్రభుత్వం పోరాడాలంటే ఈ పర్యవసానం తప్పదు
బీ. 120 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇలాంటి ఇబ్బందులు తప్పవు
సీ. ప్రభుత్వం వద్ద సరైన ముందస్తు ప్రణాళిక కొరవడడం.
4. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల భారత కరెన్సీ దొరక్క టెర్రరిస్టులు తమ కార్యకాలాపాలన్నింటినీ నిలిపివేశారని మీరు భావిస్తున్నారా?
5. నల్లడబ్బు, అవినీతి సొమ్మును దాచేందుకు పెద్ద నోట్లు ఉపయోగపడుతాయనే వాదన ఉన్న నేపథ్యంలో 2000 రూపాయల నోటును తీసుకురావడం సమంజసమని మీరు భావిస్తున్నారా?
6. 2000 రూపాయల నోటులో అదనపు సెక్యూరిటీ ఫీచర్లు లేనందున నకిలీలు త్వరగా తయారు చేస్తారని, అవి టెర్రరిస్టుల వద్దకు వెళతాయని మీరు భావిస్తున్నారా?
7. పెద్దనోట్ల రద్దు వెనుక అసలు ఉద్దేశం ఏమనుకుంటున్నారు?
ఏ. ఆర్థికపరమైన
బీ. అవినీతి నిర్మూలన
సీ. రాజకీయం
8. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి మీరు వృధా చేసుకున్న సమయం జాతీయ ప్రయోజనాల కోసమా లేదా ఎవరో చేసిన పాపానికా?
9. పెద్దనోట్ల రద్దుతో పేదలు మరణించడం అబద్ధమని అనుకుంటున్నారా?
10. పెద్దనోట్ల రద్దు నిర్ణయం, దాన్ని అమలుచేయడం వేర్వేరు అంశాలని, దీనికి పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉంటాయని భావిస్తున్నారా?
వంటి ప్రశ్నలు అడగాల్సి వుండగా, ప్రధాని ఇందుకు విరుద్ధంగా, 'ఈ దేశంలో నల్ల డబ్బు ఉందని మీరు భావిస్తున్నారా?... నల్లడబ్బును, అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా?' లాంటి ప్రశ్నలను మోడీ సంధించడాన్ని సోషల్‌ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తనోట్ల కోసం తన్నులాటలు... RBI గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఫెయిల్యూర్స్... తీసేస్తారా...?