సర్టిఫికేట్లలో చిన్నచిన్న పొరపాట్లు సహజమేనని ఢిల్లీ విశ్వవిద్యాలయం స్పష్టం చేసిది. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్ ప్రామాణికమైనదేనని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని యూనివర్శిటీ స్పష్టం చేసింది.
మోడీ విద్యార్హతలపై ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీ వర్శిటీ స్పందించిది. మోడీ ఎన్‌రోల్మెంట్ నెంబర్ cc 594/74 అని, ఎగ్జామ్ రోల్ నెంబర్ 16594 అని వెల్లడించిన వర్శిటీ, 1978లో ఆయన డిగ్రీని పూర్తి చేశారని, అయితే పొరపాటుగా 1979 అని వచ్చిందన్నారు. అలాగే పూర్తి పేరులో కొన్ని మిస్ కావడం సహజంగా జరిగే చిన్న చిన్న పొరపాట్లుగా ఢిల్లీ యూనివర్శిటీ తెలిపింది.