Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తిన పీఠానికి కేజ్రీవాలే ముఖ్యమంత్రి ... పీపుల్స్ సర్వే

Advertiesment
హస్తిన పీఠానికి కేజ్రీవాలే ముఖ్యమంత్రి ... పీపుల్స్ సర్వే
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (10:31 IST)
దేశ రాజధాని ఢిల్లీ. ఈ ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆప్‌తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ముఖ్యంగా, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ముఖ్యంగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌లు వ్యూహ రచనలు చేస్తున్నారు. 
 
కానీ, ఈ ఎన్నికల్లో వీరి వ్యూహాలు ఎంతమాత్రం పనిచేయబోవని హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ ఓ సర్వేలో తేల్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని గుర్తుచేసింది. 
 
ఇకపోతే, ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌కు మారిందని సర్వే స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేనతో ప్రయాణం ముగిసింది... ఇక రైతులతోనే... వీవీ లక్ష్మీనారాయణ