Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందు బాబులకు ఢిల్లీ సర్కారు షాక్: పబ్లిక్‌లో మద్యం సేవిస్తే జైలు శిక్షే..

మందు బాబులపై ఢిల్లీ సర్కారు సీరియస్ అయ్యింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ బహిరంగంగా పబ్లిక్‌లో మద్యం సేవించే యువతపై ఢిల్లీ సర్కారు కొరడా ఝుళిపించింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ మద్యం సేవించే యువత ఇకపై

Advertiesment
మందు బాబులకు ఢిల్లీ సర్కారు షాక్: పబ్లిక్‌లో మద్యం సేవిస్తే జైలు శిక్షే..
, గురువారం, 27 అక్టోబరు 2016 (10:21 IST)
మందు బాబులపై ఢిల్లీ సర్కారు సీరియస్ అయ్యింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ బహిరంగంగా పబ్లిక్‌లో మద్యం సేవించే యువతపై ఢిల్లీ సర్కారు కొరడా ఝుళిపించింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ మద్యం సేవించే యువత ఇకపై బాటిళ్లకు మూత పెట్టక తప్పదు. లేకపోతే డైరెక్ట్‌గా జైలుకు వెళ్లాల్సిందే. వచ్చే నెల 7వ తేదీ నుంచి పబ్లిక్‌లో మద్యం సేవించే వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరిమానా లేదా జరిమానాలతో కూడిన జైలు శిక్షను విధించనుంది.
 
ఇందుకోసం ఎక్సైజ్ శాఖ చట్టాలను కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించేవారికి రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. మద్యం సేవించి గొడవ చేస్తే జరిమానాను డబుల్ చేయడంతో పాటు సదరు వ్యక్తికి అబ్కారీ శాఖ చట్టం కింద మూడు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మయూర్‌ విహార్‌ ఫేజ్‌-2లోని నాలుగు మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో రెండు దుకాణాలను ఒకే లైసెన్స్‌తో నిర్వహిస్తుండటాన్ని ఆయన గుర్తించారు. ఆ లైసెన్స్‌ సస్సెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
అక్రమంగా నడుస్తున్న మద్యం దుకాణానికి ఎక్సైజ్‌ సిబ్బంది సీల్‌ చేశారు. మయూర్‌ విహార్‌ ఫేజ్‌ 2లో మద్య దుకాణాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్‌ శాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఈ దాడులను నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు అడ్డుగా ఉందనీ ప్రియురాలి అక్కను వేధించిన ప్రియుడు...