Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ పునరావాస కేంద్రంలో దారుణం.. కాపాడాల్సిన చేతులే కాటేశాయి..

ఢిల్లీ పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది. మానప్రాణాలు కాపాడాల్సిన చేతులే కాటేశాయి. ఢిల్లీలో అక్రమరవాణా ముఠాల నుంచి, వ్యభిచార నిర్వహణ ముఠాల నుంచి పోలీసుల చొరవతో తప్పించుకుని ప్రభుత్వ పునరావాస కేంద్రాన

ఢిల్లీ పునరావాస కేంద్రంలో దారుణం.. కాపాడాల్సిన చేతులే కాటేశాయి..
, మంగళవారం, 2 మే 2017 (10:07 IST)
ఢిల్లీ పునరావాస కేంద్రంలో దారుణం జరిగింది. మానప్రాణాలు కాపాడాల్సిన చేతులే కాటేశాయి. ఢిల్లీలో అక్రమరవాణా ముఠాల నుంచి, వ్యభిచార నిర్వహణ ముఠాల నుంచి పోలీసుల చొరవతో తప్పించుకుని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి చేరిన కౌమారప్రాయ బాలికలకు అక్కడ భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి అధికారులు తమపై అత్యాచారానికి పాల్పడినట్లు కనీసం ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వయసుకు మించి ఎదుగుదలకు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు కొంత మంది బాలికలు ఫిర్యాదు చేశారు. ఆక్సిటోసిన్‌ తరహా ఇంజెక్షన్లు ఇచ్చినట్లు బాలికలు ఆరోపించారని, పోలీసులు వైద్యపరీక్ష చేయించారని అధికార వర్గాలు వెల్లడించాయి. పునరావాస కేంద్ర సిబ్బంది ఒకరు తనను హింసిస్తున్నారని ఒక బాలిక ఫిర్యాదు చేసినందుకు ఆమెకు రోజుల తరబడి అన్నం పెట్టకుండా కడుపు మార్చారు. 
 
నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. మనుషులను అక్రమ రవాణా చేసేవారు బాలికలకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను ఎక్కువగా ఇస్తుంటారు. ఈ బాలికల్లో చాలా మంది పలుమార్లు అత్యాచారాలకు గురవుతారు. ఆ తర్వాత వ్యభిచార గృహాలకు అమ్మేస్తారు. ఢిల్లీ పునరావాస కేంద్రంలో దారుణం గురించి ఒక బాలిక ఢిల్లీ న్యాయసేవల సంస్థకు ఏప్రిల్‌ మొదటి వారంలో లేఖ రాయడంతో వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీ సర్పంచ్ దారుణ హత్య... ఎవరు చంపించారు?