Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న హైదరాబాద్ బిర్యానీలో కుళ్లిన మాంసం.. నేడు చికెన్ మామూస్‌లో కుక్క మాంసం

మొన్నటికి మొన్న హైదరాబాద్ బిర్యానీలో కల్తీ వున్న విషయాన్ని కనుగొన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని హోటళ‍్లపై జీహెచ్‌ఎంసీ ప్రజారోగ‍్య శాఖ అధికారులు విస్తృతంగా దాడులు కొన‌సాగిస్తూ ప్ర‌మాణాలు పాటిం

Advertiesment
నిన్న హైదరాబాద్ బిర్యానీలో కుళ్లిన మాంసం.. నేడు చికెన్ మామూస్‌లో కుక్క మాంసం
, శనివారం, 22 జులై 2017 (12:23 IST)
మొన్నటికి మొన్న హైదరాబాద్ బిర్యానీలో కల్తీ వున్న విషయాన్ని కనుగొన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని హోటళ‍్లపై జీహెచ్‌ఎంసీ ప్రజారోగ‍్య శాఖ అధికారులు విస్తృతంగా దాడులు కొన‌సాగిస్తూ ప్ర‌మాణాలు పాటించ‌ని వాటిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న సంగతి తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్‌లోని హోట‌ళ్ల‌లో అధికారులు విస్తృతంగా త‌నిఖీలు చేశారు. అక్క‌డి శివాని హోటల్‌లో త‌నిఖీలు నిర్వ‌హించిన అధికారులు పాచిపోయిన ఆహార పదార్థాలను నిల‍్వ ఉంచినట్లు కనుగొని, యాజమాన‍్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్‌లో పాడైపోయిన‌ ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసం ఉన్న‌ట్లు చెప్పారు.
 
ఇక‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని గ్రీన్‌ బావర్చి హోటల్‌, శిల్పి హోటళ‍్లు కూడా ప్ర‌మాణాలు పాటించ‌డంలేని గుర్తించిన అధికారులు ఆయా హోట‌ళ్ల‌కు రూ.5 వేల చొప్పున జ‌రిమానా వేశారు. ఆ హోట‌ళ్ల వంటగది అపరిశుభ్రంగా ఉంద‌ని చెప్పారు. అలాగే హోటల్‌ బృందావనంలో అధికారులు పాడైన పదార్థాలను గుర్తించారు, ఇలా హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే మాంసాహారంలో కల్తీ జరుగుతుందని వార్తలొచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కొన్ని హోటళ్లలో చికెన్ మామూస్ పదార్థంలో కుక్క మాసం వాడుతున్నట్లు తెలియవచ్చింది.
 
దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ అధికారులు ఢిల్లీ కంటోన్నెంట్ పరిధిలోని పలు హోటళ్ల ఫుడ్స్ క్వాలిటీని అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటించని 20 హోటళ్ల వరకు సీజ్ చేశారు. అంతేగాకుండా కంటోన్మెంట్ పరిధిలోని పలు హోటళ్లపై వినియోగదారులు నుంచి ఫిర్యాదు ఆధారంగానే హోటళ్లు సోదాలు నిర్వహించినట్లు కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ పేరుతో వంచించి.. నగ్నచిత్రాలు, వీడియోలను పోర్న్ సైట్లో అప్ లోడ్ చేశాడు..