Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''నాన్నా'' అంటూ కూతురు భోజనానికి పిలిచింది.. కానీ తండ్రి దుస్తులు లేకుండా?!

నాన్నపై ఆ కూతురుకి ప్రేమ. కూతురిపై ఆ తండ్రికీ ఎనలేని ప్రేమ. ఇందుకోసం ఒకే కాంప్లెక్స్‌లో వేర్వేరు ఇళ్ళల్లో ఉంటున్నారు. రేపే (జూలై 22) ఆ నాన్నకు పుట్టిన రోజు. బర్త్ డే సెలెబ్రేషన్లు బాగా చేయాలని ఆ కూతుర

''నాన్నా'' అంటూ కూతురు భోజనానికి పిలిచింది.. కానీ తండ్రి దుస్తులు లేకుండా?!
, గురువారం, 21 జులై 2016 (12:23 IST)
నాన్నపై ఆ కూతురుకి ప్రేమ. కూతురిపై ఆ తండ్రికీ ఎనలేని ప్రేమ. ఇందుకోసం ఒకే కాంప్లెక్స్‌లో వేర్వేరు ఇళ్ళల్లో ఉంటున్నారు. రేపే (జూలై 22) ఆ నాన్నకు పుట్టిన రోజు. బర్త్ డే సెలెబ్రేషన్లు బాగా చేయాలని ఆ కూతురు భావించింది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.

మధ్యాహ్న సమయంలో తండ్రీకూతుళ్ళు కలిసే భోంచేస్తారు. నాన్నను భోజనానికి ఫోనులో పిలిచినా లిఫ్ట్ చేయకపోవడంతో.. ఇక ఇంటికెళ్లి చూద్దామనుకున్న ఆ కూతురు షాక్‌కు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
ఇక వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో అంబిలి, ఆమె తండ్రి విజయ్ కుమార్ వేర్వేరు ఇళ్లల్లో ఉండేవారు. విజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేసేవారు. 2011లో పదవీ విరమణ చేశారు. వారిది కేరళ, 1994లో ఢిల్లీ వచ్చి స్థిరపడ్డారు. ఇక విజయ్ కుమార్ భార్య ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్నారు. అలాగే కూతురు అంబిలి రాజ్యసభ టీవీలో జర్నలిస్టు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆమె భర్త ఆర్కిటెక్ట్‌. 
 
ఈ నేపథ్యంలో ఒకే కాంప్లెక్స్‌లో వేర్వేరుగా ఉన్న తండ్రిని ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి పిలుద్దామని అంబిలి వెళ్ళింది. ''నాన్నా'' అని పిలుస్తూ వెళ్ళి గదిలో చూడగానే.. ఓ చాప క్రింద తన తండ్రి నిర్జీవంగా పడి ఉండటం కనిపించింది. శరీరంపై బట్టలు లేకుండా రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి అంబిలి భోరున విలపించారు. ఆయన శరీరంపై కత్తిపోట్లు కనిపించాయి. అంతేగాకుండా ఇంట్లో ఉండే టీవీ కనిపించలేదు. దీంతో  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఈ జన్మలో సీఎం కాలేరు: పల్లె రఘునాథ రెడ్డి జోస్యం