Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళకు 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు కోర్టు అనుమతి.. ఎక్కడ?

Pregnancy

ఠాగూర్

, శుక్రవారం, 5 జనవరి 2024 (10:40 IST)
ప్రమాదంలో భర్త మృతి చెందడంతో తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన మహిళ పట్ల కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆమె 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. తన భర్త మృతి తర్వాత మానసికంగా దెబ్బతినడంతో గర్భాన్ని తొలగించుకుందుకు జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె 27 వారాల గర్భంతో ఉంది. 
 
భర్త మరణంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గరువుతున్నట్టు ఎయిమ్స్ వైద్యులు నివేదికను ఈ సందర్భంగా న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె మానసిక సమతౌల్యాన్ని కోల్పోతోందని, తనకు తాను హాని చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిటిషన్ ఆత్మహత్య ధోరణి ప్రవర్తిస్తున్నందు వల్ల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. 
 
గత యేడాది అక్టోబరు 9వ తేదీన భర్త మరణించాడని, అందువల్ల తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. అదే యేడాది డిసెంబరు 22వ తేదీన ఆమె మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించాలని ఎయిమ్స్ కోర్టు ఆదేశించింది. వైద్యు నివేదిక ఆధారంగా కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 
 
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం - ముత్యాల తలంబ్రాలతో సీఎం రేవంత్! 
 
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ యేడాది శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం నిర్వించేందుకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. శ్రీరాముల వారికి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. 
 
ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించి, అదేరోజున మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మరుసటి రోజు 18న మహాపట్టాభిషేకం, రథోత్సవం జరుపుతారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 9న క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. 
 
ఈ క్రమంలో 13న బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 14న ధ్వజపట లేఖనం, 15న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, 16న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. 19న మహదాశీర్వచనం, 20న తెప్పోత్సవం, దొంగలదోపు, 21న ఊంజల్‌ సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీపుష్ప యాగం నిర్వహించనున్నారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరిగే ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు నిత్యకల్యాణాలు, 13 నుంచి 23 వరకు దర్బారు సేవ, ప్రభుత్వోత్సవం నిలిపివేయనున్నారు. మే 2న నూతన పర్యంకోత్సవం నిర్వహించనున్నారు.
 
కాగా, ఈ యేడాది శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో వస్తారని రామభక్తులు ఎదురుచూస్తున్నారు. 2016లో శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి సీఎం కేసీఆర్‌ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంక్రాంతికి 4500 ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడ?