Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు షాక్... రూ.25 వేల అపరాధం

kejriwal
, శుక్రవారం, 31 మార్చి 2023 (18:28 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ కోర్టు షాకిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు చూపించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయనకు చుక్కెదురైంది. ప్రధాని మోడీ సర్టిఫికేట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా అంటూ గుజరాత్ హైకోర్టు ప్రశ్నిస్తూ మొట్టికాయలు కూడా వేసింది. పనిలోపనిగా పిటిషనర్‌కు రూ.25 వేల అపరాధం కూడా విధించింది. ప్రధాని మోడీ సర్టిఫికేట్లను చూపించాల్సిన అవసరం పీఎంవోకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బీరేన్ వైష్ణవ్‌‍తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు తీర్పును వెలువరించింది. 
 
ఇది ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి పదవి చేపడితే అతడు డాక్టరేట్ చేశాడా లేదా నిరక్షరాస్యుడా అనే తేడాలు ఉండరాదు. అయినా ఆ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది అంటూ కోర్టు ప్రశ్నించింది. 
 
మరోవైపు, ఈ కేసులో గుజరాత్ యూనివర్శిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గతంలో సమర్పించిన వివరాల ప్రకారం గుజరాత్ యూనివర్శిటీ నుంచి 1978లో డిగ్రీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : మనీశ్ సిసోడియాకు బెయిల్ నిరాకరణ