Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లాస్‌ రూమ్‌లో బాలికను రేప్ చేసిన నాలుగున్నరేళ్ళ బుడతడు.. ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. తరగతి గదిలోనే సహచర బాలికపై నాలుగున్నరేళ్ళ బాలుడు రేప్ చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలుపట్టుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస

Advertiesment
Delhi
, గురువారం, 23 నవంబరు 2017 (18:46 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. తరగతి గదిలోనే సహచర బాలికపై నాలుగున్నరేళ్ళ బాలుడు రేప్ చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలుపట్టుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగున్నరేళ్ళ బాలుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ బుడతడు ఎవరూలేని సమయంలో తనతోపాటు చదివే అదే వయసు బాలికపై లైంగిక చర్యకు పాల్పడ్డాడు. 
 
పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన విద్యార్థిని ఒళ్లంతా నొప్పులుగా ఉందని తన తల్లితో చెప్పడంతోమెదట పెద్దగా పట్టించుకోలేదు. కానీఅదే రోజు రాత్రి ఆ విద్యార్థిని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి తరగతి గదిలో తనపట్ల ఓ విద్యార్థి ప్రవర్తించిన తీరును చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. 
 
ఆ వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షించి లైంగిక వేధింపులకు గురైనట్టు నిర్ధారించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతి సున్నితమైన కేసు కావడంతో న్యాయ నిపుణులను సంప్రదించినట్లు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. లైంగిక నేరాల పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో పెళ్లి చేసుకోవాలని కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి...