Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#BudgetSession2019 : రక్షణ రంగానికి నిధుల వరద

#BudgetSession2019 : రక్షణ రంగానికి నిధుల వరద
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:07 IST)
చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పాటు ఉగ్ర మూకల నుంచి ముంపు పొంచివుండటంతో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, తాత్కాలిక బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా రూ.3 లక్షల కోట్ల నిధులను కేటాయించింది. ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్రవేశపెట్టిన బ‌డ్జెట్‌లో వెల్లడించారు. 
 
అంతేకుకండా, సైనికుల కోసం వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ కింద రూ.35 వేల కోట్లు పంపిణీ చేసిన‌ట్లు మంత్రి గోయ‌ల్ తెలిపారు. మ‌న సైనికులే మ‌న గ‌ర్వ‌మ‌ని, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ స్కీమ్‌ను అమ‌లు చేశామ‌ని మంత్రి తెలిపారు. ఫలితంగా సైనికుల జీతాల‌ను కూడా గ‌ణ‌నీయంగా పెంచామ‌న్నారు.
 
ఇకపోతే, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తం 1.53 కోట్ల గృహాలు నిర్మించినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. 22 పంటలకు కనీస మద్దతు ధరను 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. 
 
2019-20లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల కోసం రూ.75 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. పశుసంవర్థక, మత్స్యశాఖ రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా 6 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది 8 కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
 
ఇకపోతే, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న భారతీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 98 శాతానికి పైగా పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిచేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 5.45 లక్షల గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా(ఓడీఎఫ్‌) తీర్చిదిద్దినట్లు మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Budget2019... 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌