Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amoeba: మెదడును తినే అమీబా.. కేరళలో 20మంది మృతి

Advertiesment
eating amoeba

సెల్వి

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (16:27 IST)
eating amoeba
కేరళలో అమీబా కారణంగా 20మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పిలుస్తున్న నాగ్లేరియా ఫౌలెరీ కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధి కారణంగా 69 కేసులు నమోదైనాయి. ఇందులో 20మంది మృతి చెందారు. 
 
ఈ వ్యాధికి గురైన వారిలో మూడు నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు వున్నారు. ఈ అమీబా చెరువులు, నదులు, సరైన క్లోరినేషన్ లేని స్విమ్మింగ్ పూల్‌లో వుంటుంది. 
 
ఈ అమీబా కలుషితమైన నీటిలో స్నానం చేయడం స్విమ్ చేయడం ద్వారా ముక్కు ద్వారా శరీరానికి ప్రవేశించి.. అక్కడి నుంచి మెదడు వాపుకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకమైన మెదడు వాపుకు దారితీస్తుంది.
 
ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో సాధారణ జ్వరం లేదా మెదడువాపు వ్యాధిని పోలి ఉంటాయి. వాటిలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ వంటివి ఉంటాయి. 
 
వ్యాధి ముదిరే కొద్దీ, స్పృహ కోల్పోవడం, కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి మరణాల రేటు 97 శాతం కాగా, కేరళలో మెరుగైన నిర్ధారణ, చికిత్స వల్ల మరణాల రేటు 24 శాతంగా ఉంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు