దావూద్ గ్యాంగ్‌తో అబు అజ్మీకి లింకులు : అమర్ సింగ్
సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీకి అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఆరోపించారు. ఈనెల 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఓ ఎమ్మెల్యే సీ
సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీకి అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఆరోపించారు. ఈనెల 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఓ ఎమ్మెల్యే సీటు కింద సుమారు 60 గ్రాముల పేలుడు పదార్థం కనిపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై అమర్ సింగ్ స్పందించారు.
శాసనసభలో పేలుడు పదార్థం లభ్యంకావడం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీ ముఠా హస్తం ఉండే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఈ ముఠాతో అబు అజ్మీకి లింకులు ఉన్నాయన్నారు. 1993 ముంబై దాడుల నిందితులు దేశం నుంచి పారిపోవడానికి అబు అజ్మీ సహాయపడ్డారన్నారు.
అందువల్ల అసెంబ్లీలో పేలుడు పదార్థం లభ్యమైన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో దావూద్ కంపెనీ ప్రమేయం ఉండవచ్చునన్నారు. అలాగే, అబు అజ్మీ విదేశీ పర్యటనలపై భద్రతా సంస్థలు నిఘా పెట్టాలని ఆయన కోరారు.