ఒక వ్యక్తి తన స్వార్జితం, పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తుల్లో వారసులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆస్తుల విషయంలో వ్యక్తి సోదరుని పిల్లలకుకాకుండా కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా లేక సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరించింది.
హిందూ మతానికి చెందిన వ్యక్తి లేదా మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే వారికి తమ తల్లిదండ్రులనుంచి సంక్రమించిన ఆస్తిపై తండ్రి వారసులందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే భక్త వారసులకు హక్కు లభిస్తాయి అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.