Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో మరో నిర్భయ.. 14 ఏళ్ల మైనర్ బాలికపై పదే పదే లైంగిక దాడి.. ఆపై యాసిడ్ తాగించి.. చివరికి?

14 ఏళ్ల బాలికపై అత్యాచారమే దారుణం.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. విచారణకు ముందు బాలికను మరోసారి కిడ్నాప్ చేసిన దుర్మార్గులు ఆమెపై మరోసారి లైంగిక దాడి చేయడమే కాకుండా.. ఆమెచే బలవంతంగా యాసిడ్ లాంటి ద్రా

Advertiesment
Dalit minor
, మంగళవారం, 26 జులై 2016 (12:19 IST)
14 ఏళ్ల బాలికపై అత్యాచారమే దారుణం.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. విచారణకు ముందు బాలికను మరోసారి కిడ్నాప్ చేసిన దుర్మార్గులు ఆమెపై మరోసారి లైంగిక దాడి చేయడమే కాకుండా.. ఆమెచే బలవంతంగా యాసిడ్ లాంటి ద్రావణాన్ని తాగించారు. అంతే ఆ బాలిక నరక యాతన అనుభవించింది.

నెలపాటు రక్తపు వాంతులు చేసింది. ఆమె నోరు, ఛాతీ అవయవాలు నల్లబారాయి. అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలా బాధపడుతూ.. 14 ఏళ్ల బాలిక ఆదివారం మరో నిర్భయలా ఢిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూసింది. 
 
వివరాల్లోకి వెళితే గత డిసెంబరులో దళిత మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శివశంకర్‌ను అరెస్టు చేయగా, అతడు కొద్ది రోజులకే బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణకు ముందు బాలికను మరోసారి కిడ్నాప్‌ చేసిన దుండగుడు ఆమెపై పదే పదే అత్యాచారం చేసి చివరికి ఆమెతో బలవంతంగా యాసిడ్ లాంటి లిక్విడ్‌ను తాగించాడు. దీంతో నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన మైనర్ బాలిక ఆదివారం కన్నుమూసింది. మరోవైపు కోర్టులో ఏమైనా విషయాలు బయటకు చెప్తే.. కొడుకు సంగతి చూస్తామని నిందితులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని తల్లి వాపోయింది. 
 
మరోవైపు మహిళల భద్రతపై కేంద్రం, ఢిల్లీ పోలీసులపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ (డీసీడబ్ల్యూ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంకా ఎంతమంది నిర్భయలను మీరు కోరుకుంటున్నారు? మరో నిర్భయ మరణించేవరకూ ఎదురుచూస్తూ ఉండాల్సిందేనా?' అని డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ ట్వీట్‌ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు ఎంతమంది బాలికలు, మహిళలు అత్యాచారానికి గురై మరణించినా పట్టించుకోకుండా నిందితులను పట్టుకుంటారో లేకుంటే అలానే గాల్లోకి తిరగనిస్తారో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఫ్ తినడం నేరం కాదు.. ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకోవద్దు: మద్రాస్ హైకోర్టు