Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''నెత్తి" బొట్టుకు తగిలిన బుల్లెట్.. అయినా నేలకొరగని సీరియల్ హీరోయిన్.. మల్లెపూలు పెట్టుకుని..?!

టీవీల్లో సీరియల్స్ గోల ప్రస్తుతం అంతా ఇంతా కాదు. సాయంత్రం ఆరు గంటలైందంటే చాలు ఆడవాళ్లు సీరియల్స్ చూసేందుకు అన్నీ పనులు ముగించుకుని టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆడవాళ్ల కోసం మగాళ్లు కూడా వేరే ఛానల్స్ చూడ

Advertiesment
Daily Serial
, గురువారం, 28 జులై 2016 (16:46 IST)
టీవీల్లో సీరియల్స్ గోల ప్రస్తుతం అంతా ఇంతా కాదు. సాయంత్రం ఆరు గంటలైందంటే చాలు ఆడవాళ్లు సీరియల్స్ చూసేందుకు అన్నీ పనులు ముగించుకుని టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆడవాళ్ల కోసం మగాళ్లు కూడా వేరే ఛానల్స్ చూడలేక సీరియల్స్ చూసుకుంటున్నారు. సాయంత్రం ఆరు నుంచి 10 గంటల దాకా ఈ సీరియల్స్ కథల చుట్టే మహిళల మనస్సంతా తిరుగుతూ ఉంటుంది. 
 
సీరియల్స్ అంటేనే సాగదీయడం, మధ్యమధ్యలో యాడ్స్ వేయడం అందరికీ తెలిసిందే.  అలాంటి సీరియల్స్‌లో రియల్ ఎంత మేరకు ఉందో తెలియదు కానీ.. ఎంత రియల్ కాకపోయినా జనాన్ని మరీ ఇంతగా మోసం చేస్తున్నారని ఓ తమిళ సీరియల్ చూస్తే అర్థమవుతుంది. తమిళంలో ప్రసారమయ్యే చంద్రలేఖ అనే సీరియల్ చూస్తే కంటతడి పెట్టుకోవాల్సిందే. ఏడుపు రానివారిని కూడా ఏడ్పించే విధంగా ఈ సీరియల్ ఉంటుంది. కానీ ఈ సీరియల్‌కు చెందిన జూలై 23వ రోజున ప్రసారమైన ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో వాడీవేడిగా చర్చ సాగుతోంది. 
 
సదరు ఎపిసోడ్‌లో హీరోయిన్‌ను పాయింట్ బ్లాంక్‌లో ఓ వ్యక్తి గన్‌తో కాలుస్తాడు. సాధారణంగా పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ తగిలితే ఎవరైనా క్షణాల్లో నేలకొరుగుతారు. కానీ ఈ సీరియల్ హీరోయిన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది. దాదాపు రెండు నిమిషాల పాటు మాట్లాడుతుంది. ఆ తర్వాత భర్త చేత మల్లెపూలు పెట్టించుకుంటుంది. ఆపై వీడియోలు చూస్తుంది. 
 
అలా బ్లాంక్‌లో బుల్లెట్ దిగినా స్పృహ తప్పకుండా అలానే మాట్లాడుతూ.. ఏవేవో చేస్తుంది. దీంతో సీరియల్స్ చూసేవారిని ఇలా కూడా మోసం చేయాలా అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. అంతేకాదండోయ్.. ''నెత్తి'' (నుదటన) బొట్టు పెట్టుకునే చోట బుల్లెట్టు దిగినా ఆ హీరోయిన్ ఎంతసేపటికీ మాట్లాడుతూ కనిపించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవి కన్నుమూత.. కోల్‌కతాలో