అత్యాచారం చేసిండు.. కట్నం అడిగిండు.. అరెస్టయ్యిండు..
అత్యాచారానికి పాల్పడి పంచాయితీ పెద్దలు జరిమానా విధిస్తే కట్టేసే వాళ్లను చూశాం. అమ్మాయి జీవితం బలైపోయింది. మెడలో తాళి కట్టి బుద్ధిగా కాపురం చేసుకో అంటే ఒప్పేసుకునే వాళ్లను చూశాం. కానీ అత్యాచారం చేసి కూడా పెళ్లి చేసుకోవాలంటే అయిదు లక్షల రూపాయల కట్నం
అత్యాచారానికి పాల్పడి పంచాయితీ పెద్దలు జరిమానా విధిస్తే కట్టేసే వాళ్లను చూశాం. అమ్మాయి జీవితం బలైపోయింది. మెడలో తాళి కట్టి బుద్ధిగా కాపురం చేసుకో అంటే ఒప్పేసుకునే వాళ్లను చూశాం. కానీ అత్యాచారం చేసి కూడా పెళ్లి చేసుకోవాలంటే అయిదు లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసి పెళ్ళిని ఆపేసిన ప్రబుద్ధుడు క్రిమినల్స్‌లో క్రిమినల్‌గా నిలబడ్డాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా గ్రామానికి చెందిన తాజ్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామపెద్దలను ఆశ్రయించారు.వారు నిందితుడిని పిలిపించి కేసులేమీ పెట్టబోమని అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తీర్మానించారు.
తాజ్ అందుకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని తీరా పెళ్లి తేదీ దగ్గరపడుతున్న సమయంలో రూ.5 లక్షలు కట్నం కావాలని అన్నాడు. అందుకు బాధితురాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో తాజ్ పెళ్లి ఆపేశాడు. చేసేదేంలేక నిస్సహాయులైన బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తాజ్‌పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. మంచి కంటే చెడు ఎక్కువగా పాకిపోయే రోజులు కాబట్టి ఇతగాడు ఇకపై అత్యాచారాలు చేసేవాళ్లందరికీ ఆదర్శమూర్తి అయిపోవచ్చు. రేప్ చేసి పెళ్లాడాలంటే కట్నం ఇవ్వాల్సిందే అని తిరగబడే ఆదర్శమూర్తులన్నమాట.