Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మను చూసైనా నీతిగా ఉండండి.. నారాయణ: అప్పుడే అమ్మపై కుట్ర జరిగింది..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితాన్ని చూసైనా మిగిలిన నేతలు నీతివంతంగా ఉండాలని సీపీఐ నేత నారాయణ హితవు పలికారు. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. నోట్లరద్దు అనాలోచిత చర్య అని మండిపడ్డారు. హి

అమ్మను చూసైనా నీతిగా ఉండండి.. నారాయణ: అప్పుడే అమ్మపై కుట్ర జరిగింది..
, శనివారం, 10 డిశెంబరు 2016 (14:14 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవితాన్ని చూసైనా మిగిలిన నేతలు నీతివంతంగా ఉండాలని సీపీఐ నేత నారాయణ హితవు పలికారు. ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. నోట్లరద్దు అనాలోచిత చర్య అని మండిపడ్డారు. హిట్లర్ కూడా మోదీలా జాతీయ సంపదను వృథా చేయలేదన్నారు. రాజకీయ అవినీతిని ఆపకుండా బ్లాక్ మనీని ఆపడం సాధ్యం కాదని నారాయణ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బ్యాంకు అధికారులను టెలికాన్పిరెన్స్‌లతో చంపుతున్నారన్నారు. చంద్రబాబు ఎక్కువ మాట్లాడి...తక్కువ పనిచేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.
 
ఇకపోతే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును బెంగళూరుకు తరలించడం వెనుక 'మన్నార్‌గుడి మాఫియా'నే కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఆమె నుంచి అధికారాన్ని చేజిక్కించుకునే వ్యూహంలోనే శశికళ ఆ దిశగా పావులు కదిపినట్టు తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ 2012లో రాసిన కథనంలో పేర్కొన్నారు. 
 
జయలలిత మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో నాలుగేళ్ల నాటి ఈ కథనానికి మళ్లీ ప్రాధాన్యం ఏర్పడింది. బెంగుళూరులో జయకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి, కోర్టు ఆమెను తప్పుపట్టిన పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుందని... తనకు నమ్మకమైన వ్యక్తికి జయకు పగ్గాలు అప్పగించడం ఖాయమని శశికళ కుటుంబం ముందే పసిగట్టినట్టు జీమన్ బయటపెట్టారు.
 
ఈ కథనం ప్రకారం.. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పోలీస్ అధికారి, నాటి తమిళనాడు డీజీపీ రామానుజంకు కర్నాటక డీజీసీ శంకర్ బీదారి మన్నార్‌గుడి మాఫియా (శశికళ బంధుగణం) రహస్య సమావేశం గురించి చెప్పారు. బెంగళూరులో జరిగిన ఈ రహస్య భేటీని కర్నాటక ఇంటిలిజెన్స్ అధికారులు ముందుగానే పసిగట్టి మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశారు. కర్నాటక పోలీసుల ప్రధాన కార్యాలయం నుంచి చెన్నై డీజీపీ ఆఫీసుకు సదరు టేపులు అందాయి. ఈ టేపుల ద్వారా జయలలితపై జరుగుతున్న కుట్ర మొత్తం బట్టబయలైనట్టు తెహల్కా పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారమే రాజాజీ హాలును శుభ్రం.. ఆ ప్రకటనలో నటరాజన్ పాత్ర? మోడీ చేతిలో రిమోట్?