Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేప్ కేసులో చిక్కుకున్న గాయత్రి ప్రజాపతి మిస్సింగ్.. యూపీలో పోలీసులకు తలనొప్పి

ఆయనో మంత్రి కానీ రేప్ కేసులో చిక్కుకున్నాడు. ఇక చేసేది లేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మంత్రి మిస్సింగ్ అంటూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా వివాదాస్పద గుజరాత్ మంత్రి గాయత్రి ప్రజాపతి గు

Advertiesment
UP minister
, బుధవారం, 1 మార్చి 2017 (10:10 IST)
ఆయనో మంత్రి కానీ రేప్ కేసులో చిక్కుకున్నాడు. ఇక చేసేది లేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మంత్రి మిస్సింగ్ అంటూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇదంతా  వివాదాస్పద గుజరాత్ మంత్రి గాయత్రి ప్రజాపతి గురించే. ఓ అత్యాచారం కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీకోర్టునుంచి మార్గదర్శకాలు రావడంతో.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు రెడీ అయిపోయారు. 
 
కానీ మంత్రి మాత్రం ఎస్కేప్ అయిపోయాడు. ప్రజాపతితో పాటు మరికొందరిని గతంలో మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ... సీఎం అఖిలేశ్ మళ్లీ ఆయనను కేబినేట్లోకి తీసుకున్నారు. ఇక యూపీలో ఇంకా రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు మిగిలి ఉండడంతో... ప్రజాపతి వ్యవహారం సీఎంకు తలనొప్పిగా మారనుంది. 
 
యూపీలో ప్రతిరోజు ఉదయం గాయిత్రీ ప్రజాపతి మంత్రం ఆలపించే పార్టీ ఒకటి ఉంది'' అంటూ తనదైన శైలిలో ప్రధాని వ్యంగ్యాస్త్రం విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాపతి కనుమరుగు కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రేప్ కేసు కూడా ఆయన మీద ఉండటం ద్వారా.. దాని నుంచి తప్పించుకోవడానికే అజ్ఞాతానికి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. భోజనం వడ్డించడం లేటైందని.. చెంప ఛెళ్లుమనిపించాడు..