Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్తమామల వేధింపుల వల్లే భార్యతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్య

అత్తమామల వేధింపుల వల్లే తాను భార్యతో కలిసి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షాత్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్ తమ ఆత్మహత్యకు కారణమెవరో చెపుతూ వీడియో చిత్రీకరించి.. దాన్ని స్నేహితులకు పంపించి భార్య

Advertiesment
అత్తమామల వేధింపుల వల్లే భార్యతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్య
, శనివారం, 17 జూన్ 2017 (10:05 IST)
అత్తమామల వేధింపుల వల్లే తాను భార్యతో కలిసి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాక్షాత్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్ తమ ఆత్మహత్యకు కారణమెవరో చెపుతూ వీడియో చిత్రీకరించి.. దాన్ని స్నేహితులకు పంపించి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై నగరంలో ఎర్నావూర్‌లో జరిగింది. అత్తమామల వేధింపుల వల్లే తాను భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని కానిస్టేబుల్ పేర్కొనడం సంచలనం రేపింది. 
 
ఎగ్మోర్ ఆర్మ్‌డ్ రిజర్వు విభాగానికి చెందిన సుందర పాండీ (29) అనే పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. ఇతను 18 నెలల క్రితం రామంతాపురానికి చెందిన శశికళ (23)ను వివాహమాడారు. పెళ్లయిన మరుసటి రోజే భార్యాభర్తల మధ్య వివాదాలు వెల్లువెత్తడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. 
 
విడిగా ఉంటున్న దంపతులను బంధువులు కలిపి  నెలరోజుల పాటు కలిసి ఉండేలా చేశారు. భార్య బంధువుల ఇంట్లో వారు అద్దెకు ఉంటుండగా మరోసారి వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మనోవేదనకు గురైన భార్య శశికళ జూన్ 12న ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందాక తిరిగి ఇంటికి వచ్చింది. అనంతరం పడకగదిలో కానిస్టేబుల్ సుందరపాండీ తన భార్య శశికళతో కలిసి ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటు పళని, ఇటు పన్నీరు.. ఇద్దరినీ వణికిస్తున్న దినకరన్.. 34 మంది ఎమ్మెల్ల్యేలను తిప్పుకున్నాడే.!