Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?

Advertiesment
వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?
, సోమవారం, 15 అక్టోబరు 2018 (09:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె మరో కులం వ్యక్తితో లేచిపోయిందనీ... ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు 24 యేళ్ళ ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఈమె తన కాలేజీలో చదివే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా, ఆ యువకుడుని మరిచిపోవాలని సూచించారు. అయినప్పటికీ.. ఆ యువతి ప్రియుడుని మరిచిపోలేక అతనితో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. 
 
ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. తమ పరువు పోయిందని భావించిన ఆ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి వారు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడివున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడు గొంతు నులిమితే... భార్య ఎదురొమ్ముపై గుద్ది భర్తను చంపేసింది...