Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియాలోనే అత్యంత శుభ్రమైన భారత గ్రామం అదే..

Advertiesment
ఆసియాలోనే అత్యంత శుభ్రమైన భారత గ్రామం అదే..
, గురువారం, 7 మార్చి 2019 (16:16 IST)
భారతదేశం ప్రస్తుతం అనేక రంగాలలో అగ్రగామిగా వెలుగొందుతోంది. స్వచ్ఛభారత్ అంటూ మోదీ పిలుపుకు భారీ స్పందన వచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో దాని ప్రభావం అంతంతమాత్రంగా కనిపిస్తోంది. అయితే వీటితో సంబంధం లేకుండా ఒక గ్రామంలోని ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 
 
గ్రామంలో ఉన్నవారందరూ కలసికట్టుగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా పచ్చదనంతో తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు. ఈ గ్రామం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్‌లో భారత్‌లోనే కాదు ఆసియాలోనే ఆదర్శంగా నిలుస్తోంది. 
 
ఆ ఊరిలో కేవలం 500 మంది మాత్రమే జనాభా ఉన్నారు. అది మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మౌలినాంగ్ అనే చిన్న గ్రామం. ఆ గ్రామమే ఇప్పుడు ఆసియా ఖండంలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా ఎంపికైంది. అటు పచ్చదనంలోనూ, ఇటు పరిశుభ్రతలోనూ మౌలినాంగ్ గ్రామం అందరి మన్నలను అందుకుంటోంది. 
 
షిల్లాంగ్‌కి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌలినాంగ్ అనేది చిన్న గ్రామమే అయినప్పటికీ, అక్కడి ప్రకృతి సోయగాలు పలకరిస్తుంటాయి. ప్రతి ఇంటి ముందర వెదురుతో చేసిన చెత్త బుట్ట కనిపిస్తుంటుంది. దారి వెంట వెళ్లేవారికి చెత్తా చెదారం కనిపిస్తే ఆ బుట్టల్లో వేస్తుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తమ ఊరిని బాగు చేసుకున్నారు. 
 
అక్కడ నివసిస్తున్న ప్రజలు వెదురుతోనే ఇళ్లు నిర్మించుకుని పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటున్నారు. ఆ ఊరిలో మరో ప్రత్యేకత ఉంది. అదే 85 అడుగుల ఎత్తులో వెదురు కర్రలతో నిర్మించిన టవర్‌పైకి ఎక్కితే చుట్టూ ఉన్న రమణీయమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా, దానిపై నిలుచుంటే బంగ్లాదేశ్ కూడా కనిపిస్తుండడం మరో విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో పిల్లల గొంతు కోసిన తండ్రి... ఆపై తానుకూడా...