Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత అనారోగ్యం.. మట్టికుండల వ్యాపారం జోరు.. రూ.8 కోట్లకు విక్రయం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పుణ్యమాన్ని రాష్ట్రంలో మట్టికుండల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తమ అధినేత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలంటూ అన్నాడీఎంకే శ్రే

జయలలిత అనారోగ్యం.. మట్టికుండల వ్యాపారం జోరు.. రూ.8 కోట్లకు విక్రయం
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (11:46 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పుణ్యమాన్ని రాష్ట్రంలో మట్టికుండల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. తమ అధినేత్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు, జయలలిత అభిమానులు చేస్తున్న ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలతో కుండలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో తయారయ్యే కుండలు చాలక పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి నుంచి దిగుమతి  చేసుకోవాల్సి వస్తోంది. 
 
గడచిన నాలుగు వారాల వ్యవధిలో రూ.8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగింది. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తుండటమే కుండలకు డిమాండ్ పెంచింది. తమ పదవిని బట్టి 108, 508, 1008 కుండలను కొనుగోలు చేసి, వాటిని పాలతో నింపుతూ ప్రదర్శనలు చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తుండగా, మంత్రుల స్థాయిలో ఉన్నవారు ఏకంగా వేల సంఖ్యలో స్టీలు బిందెలను కోనేస్తుండటం గమనార్హం. 
 
ఓ మంత్రి 5 వేల బిందెలకు ఆర్డర్ ఇవ్వగా, తమ వద్ద 3 వేలు మాత్రమే ఉండటంతో కుంభకోణం నుంచి అదనపు బిందెలను తెప్పించామని పాత్రల దుకాణం వ్యాపారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రాఘవన అన్నారు. అకస్మాత్తుగా వీటికి డిమాండ్ పెరగడంతో అందుకు తగ్గట్టు తయారీని చేపట్టలేకపోతున్నామని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇసిస్ దారుణ చర్య.. అమెరికా సైన్యాన్ని అడ్డుకునేందుకు సల్ఫర్ గని బ్లాస్ట్...