ప్రస్తుతం భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయిలో వున్నాయో తెలియని విషయం కాదు. చైనా-భారత్ సరిహద్దుల వెంట, లద్దాక్ సరిహద్దు వద్ద ఇరు దళాలకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇదిలావుంటే సెప్టెంబర్ 3న 17,500 అడుగుల ఎత్తులో ఉత్తర సిక్కిం పీఠభూమి ప్రాంతంలో ముగ్గురు చైనా పౌరులు దారి తప్పారు. వారిని భారత సైన్యం రక్షించింది. ఆక్సిజన్, ఆహారం మరియు వెచ్చని బట్టలతో సహా వైద్య సహాయం అందించింది. భారత సైన్యం వారికి తగిన మార్గదర్శకత్వం ఇచ్చింది. దాంతో వారు తమ గమ్యస్థానానికి తిరిగి చేరుకున్నారు. తమన రక్షించిన సైన్యానికి చైనా పౌరులు కృతజ్ఞతలు తెలియజేశారు.