Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ. 50 వేలకు మించిన నగదు లావాదేవీలపై పన్ను బాదుడు: సీఎంల ప్యానెల్ సిపార్సు

డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంకోసం నియమించబడిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల ప్యానెల్ నగదు లావాదేపీలపై పన్ను బాదాలని కేంద్రప్రభుత్వానికి సిఫార

Advertiesment
Union Budget
హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (05:59 IST)
-డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంకోసం నియమించబడిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల ప్యానెల్ నగదు లావాదేపీలపై పన్ను బాదాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్రబడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎంల ప్యానెల్ చేసిన ప్రతిపాదనలు బడ్జెట్‌లో భాగమౌతాయని భావిస్తున్నారు. 
 
నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే రూ. 50 వేలకు పైబడిన లావాదేవీలపై పన్ను విధించాలని సీఎంల ప్యానెల్ కేంద్రానికి సిపార్సు చేసింది. ఈ సందర్భంగా ప్యానెల్ చీఫ్ తమ తాత్కాలిక రిపోర్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమర్పిస్తామని తెలిపారు. ప్యానెల్ చేసే సిఫార్సులకు కేంద్ర ఆర్థిక మంత్రి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి వాటిని బడ్జెట్‌లో పొందుపర్చడాన్ని పరిగణించనున్నారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.  
 
ప్యానెల్ చేసిన సిఫార్సుల్లో కొన్ని
 
రూ. 50 వేలకు మించిన లావాదేవీలపై పన్ను విధింపు.
స్మార్ట్ ఫోన్లు కొనడానికి ఆదాయపన్నేతర అసెస్సీలకు వెయ్యి రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి. 
ఆధార్ సంఖ్యను ఉపయోగించే మొబైల్ ఆధారిత యుఎస్ఎస్‌డి త్వరలో ప్రారంభించాలి. 
డిజిటల్ చెల్లింపులపై వ్యాపారులను ప్రోత్సహించడానికి ప్రాస్పెక్టివ్ పన్నులను తీసివేయాలి.
బయోమెట్రిక్ సెన్సర్లను ఉపయోగించే వ్యాపారులకు పన్ను ప్రోత్సాహాలను పొడిగించాలి. 
డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే వినియోగదారులకు పన్ను రీఫండ్ చేయాలి.
ఆధార ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థ కొనుగోలుకు అన్ని మర్చంట్ పాయింట్లకు 50 శాతం సబ్సిడీ పొడిగించాలి. 
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు దేశంలోని 1,54,000 పోస్టాఫీసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. 
బ్యాంకులన్నింటికీ ఆధార్ కార్డునే ప్రైమరీ కేవైసీగా మార్చాలి. 
బీమా, విద్యాసంస్థలు, ఎరువులు, పెట్రోలియం, వగైరా ప్రభుత్వ రంగ సంస్థలు డిజిటల్ చెల్లింపుకు మళ్లేలాచర్యలు చేపట్టాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ పార్టీల ఆదాయ వృద్ధి 313 శాతం.. ప్రాంతీయ పార్టీల ఆదాయ వృద్ధి 652 శాతం