మంత్రి వేధింపులు.. ఆవేశంలో రాజీనామా చేశాను.. ప్లీజ్ మళ్లీ నన్ను తీస్కోండి... అనుపమ షెనాయ్
కర్ణాటక మంత్రి వేధింపులకు నిరసనగా రాజీనామా చేసి సంచలనం సృష్టించిన కుదిల్గి డీఎస్పీ అనుపమ షెనాయ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లెక్చరర్‌గా పని చేస్తాలేదంటే ఏదైనా ఎన
కర్ణాటక మంత్రి వేధింపులకు నిరసనగా రాజీనామా చేసి సంచలనం సృష్టించిన కుదిల్గి డీఎస్పీ అనుపమ షెనాయ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని, లెక్చరర్‌గా పని చేస్తాలేదంటే ఏదైనా ఎన్జీవోలో చేరి సమాజ సేవ చేస్తానని లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తి పదవికి రాజీనామా చేసిన అనుపమ షెనాయ్ స్పష్టం చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన అనుపమ షనాయ్ మరోసారి విధుల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు అనుపమ వెల్లడించారు. అంతేకాదు రాజీనామా లేఖపై సీఎం సిద్ధరామయ్య స్పందించారని ఈ మేరకు ఫోన్ చేసి రాజీనామా ఇవ్వడమెందుకు...వాపసు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఆవేశంలో రాజీనామా చేశానని...దానిని ఉపసంహరించుకుంటున్నానని సమాధానం ఇచ్చానన్నారు. డీఎస్పీగా మరోమారు అవకాశం కోరుకుంటున్నానని తెలిపారు.