Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోయి పోయి వాళ్లతో పెట్టుకుని మటాష్ అయ్యాడే.. అఖిలేష్‌పై సానుభూతి

‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివ్‌పాల్‌ యాదప్ ఒక్కమాటలో అఖిలేష్‌ని నేరస్తుడిని చేసేశారు. అనాలోచితంగా తండ్రి ములాయం వద్దని భంగపడుతున్నా వి

పోయి పోయి వాళ్లతో పెట్టుకుని మటాష్ అయ్యాడే.. అఖిలేష్‌పై సానుభూతి
హైదరాబాద్ , ఆదివారం, 12 మార్చి 2017 (07:32 IST)
‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివ్‌పాల్‌ యాదప్ ఒక్కమాటలో అఖిలేష్‌ని నేరస్తుడిని చేసేశారు. అనాలోచితంగా తండ్రి ములాయం వద్దని భంగపడుతున్నా వినకుండా కాంగ్రెస్‌తో అంటకాగి, పొత్తు పెట్టుకుని మరీ సర్వనాశనమైపోయిన అఖిలేష్‌పై ఇప్పుడు కాసింత సానుభూతి కూడా కలుగుతోంది.
 
ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తాత్కాలిక స్నేహమేగాని ఏనాడూ అధికారం పంచుకోని ములాయం మార్గాన్ని వదిలి అఖిలేశ్‌ సాధించింది శూన్యమే. 1967లో ఎన్నికల బరిలో దిగి.. తొలి ప్రయత్నంలోనే ములాయం విజయం సాధించా రు. సోషలిస్ట్‌ నేత రాంమనోహర్‌ లోహియా, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ బాటలో పయనించి యూపీలో పెను మార్పులకు పునాదులు వేశారు. మొదటినుంచి బ్రాహ్మణేతర, కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాల్ని ములాయం వంటపట్టించుకున్నారు.
 
అయితే యాదవ పరివారంలో తండ్రి నేతృత్వం లోని వర్గాన్ని పక్కకు నెట్టి నాయకత్వాన్ని అఖిలేశ్‌ కైవసం చేసుకున్నా.. తండ్రి బాటలో మాత్రం పయనించలేదు. 2007లో 97 స్థానాలతో, 2012లో 80 స్థానాలతో బీఎస్పీ ప్రతిపక్ష హోదా సాధించగా.. ఈ సారి ప్రతిపక్ష హోదా పొందిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమైంది. అయితే అఖిలేశ్‌ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పరిస్థితి. కాంగ్రెస్‌ను పొత్తుకు ఒప్పించి అఖిలేశ్‌ విజయం సాధించినా... 40 సీట్లకు మించి పోటీచేసే సామర్థ్యం లేని ఆ పార్టీకి 60కిపైగా సీట్లిచ్చి ఆయన పెద్ద తప్పిదం చేశారు.
 
2019లో బీఎస్పీతో పొత్తు
1995లో ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య వైరం కొనసాగుతోంది. దానికి ముగింపు పలికే అవకాశాన్ని అఖిలేశ్‌ ఉపయోగించుకుంటే లౌకిక, సామాజిక శక్తులు ఏకం కావచ్చు. నరేంద్ర మోదీ దెబ్బతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపి విజయం సాధించిన నితీశ్, లాలూను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయడమే మాయ, అఖిలేశ్‌ల ముందున్న మార్గమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకు ఓటు వేయలేదు కదూ... అయిదేళ్లూ అనుభవిస్తారు పొండి: సిఎం పిల్లి శాపాలు